నల్లగొండ జిల్లా: 29 ఏళ్లు మాదిగ,ఉపకులాల సుదీర్ఘ ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మహాజన నేత మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ నెల 11న హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు యావత్ మాదిగ,ఉప కులాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి రాజు మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు మాదిగ పిలుపునిచ్చారు.
మాదిగలను సన్నద్ధం చేసే క్రమంలో ఆదివారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం మాదిగవాడలో ప్రచారం చేసి,కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులో జరిగే విశ్వరూప మహాసభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యాతిథిగా హాజరై ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరిని తెలియజేస్తారని,కాబట్టి సమస్త మాదిగ,మాదిగ ఉపకులాల గ్రామపెద్దలు, మహిళలు,యువత, విద్యార్థులు,ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి, మన బలం ఏమిటో ప్రధానికి చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నడిగూడెం మండల కో ఆర్డినేటర్ మొలుగూరి సైదులు మాదిగ, ఎమ్మార్పీఎస్ రత్నవరం గ్రామశాఖ అధ్యక్షుడు మొలుగూరి నరసింహ మాదిగ, ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ గ్రామశాఖ కార్యవర్గ సభ్యులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.