చందుర్తి మండల ముదిరాజ్ ల ఏకగ్రీవ తీర్మానం

చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తాం అని ఏకగ్రీవ తీర్మానం అది శ్రీనాన్నను ఎమ్మెల్యే గా గెలిపించుకుంటాం అని ముదిరాజ్ కుల బంధావులు హామీ కాంగ్రెస్( Congress ) పార్టీలో చేరిన పలువురు ముదిరాజ్ సంఘ సభ్యులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అది శ్రీనివాస్.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యేగా అది శ్రీనివాస్ ను గెలిపించుకుంటాం అని చందుర్తి మండల ముదిరాజ్ సంఘ సభ్యులు శుక్రవారం రోజున చందుర్తి మండల కేంద్రంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

 Unanimous Resolution Of Chandurthi Mandal Mudiraj , Chandurthi Mandal, Mudiraj,-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందుర్తి మండల ముదిరాజ్ కుల సభ్యులు అందరూ కలసి నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు పై ఓటు వేసి గెలిపిస్తాం అన్నారు.అధికార పార్టీ లో ఒక్క ముదిరాజ్ బిడ్డాకు కుడా ఎమ్మెల్యే సిటు ఇవ్వకుండా అవమానించారని అన్నారు.

ఆది శ్రీనివాస్( Adi Srinivas ) మాట్లాడుతూ తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన చందుర్తి మండల ముదిరాజ్ సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వేములవాడ నియోజకవర్గo ఏర్పడిన నాటి నుండి ఒక్క బీసీ బిడ్డా చట్ట సభల్లో అడుగు పెట్టలేదన్నారు.

ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని ఒక్క సారి ఓటు వేసి ఆశీర్వదించాలని అన్నారు.రైతులకు కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే లబ్ది చేకూరుతుందన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే చందుర్తి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని అన్నారు.ప్రాజెక్టు లు ఉన్న సాగు నీటికి నీరు అందించే ఉప కాలువలు నిర్మాణం చేయకుండా కాలయాపన చేశారని అన్నారు.60 ఏండ్ల కింద కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు లు చెక్కు చెదరకుండా ఉంటే కేసీఆర్ ఎంతో ఇష్టంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగటం చూసాం అని ప్రోజెక్టుల పేరిట జన ధనాన్ని వల్ల జేబులో వేసుకున్నారని అన్నారు.చందుర్తి మోతుక్కురావు పేట రహదారి నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదని అన్నారు.

ఖమ్మం లో సీతారామ ప్రోజెక్టు కు ఇక్కడి భూములు ఇచ్చినది వాస్తవం కాదా అని అన్నారు.చందుర్తికి ప్రభుత్వ జూనియర్ కళాశాల తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.

అధికారంలోకి వచ్చిన వారు పదవీని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారు తప్ప ప్రజాసమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.అధికార పార్టీ వారు మద్యం ,డబ్బులు విచ్చల విడిగా పంచి ఓట్లు దండుకోవాలి అని చూస్తున్నదని అన్నారు.

మీ బీసీ బిడ్డగా మీ ఇంటి బిడ్డగా వస్తున్నాని మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube