తెలంగాణలోని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు సీఎం కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వాళ్లు నోటికి వచ్చినట్లు హామీలు ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు.
వారంటీ లేని పార్టీ హామీలను నమ్ముదామా అని ప్రశ్నించారు.రూ.200 పెన్షన్ ఇవ్వలేని కాంగ్రెస్ రూ.4 వేలు ఇస్తామంటే నమ్ముదామా అని అడిగారు.కాంగ్రెస్ ది దింపుడు కల్లం ఆశ తప్ప ఏమీ లేదని చెప్పారు.ఓటుకు నోటుకు కేసులో దొరికిన దొంగ మాటలను నమ్మొద్దని సూచించారు.కాంగ్రెస్ లో టికెట్ ఒక్కో రేటుతో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.టికెట్లనే అమ్ముకునే వారిని గెలిపిస్తే రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా అని ప్రశ్నించారు.
మోదీ అన్నట్లు తమది కుటుంబ పార్టీనేనన్న మంత్రి కేటీఆర్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కుటుంబ పెద్ద కేసీఆర్ అని తెలిపారు.