తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో ఉన్న కొంతమంది హీరోలు వాళ్లకంటూ సపరేట్ ఇమేజ్ కోసం ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు.ఇక్కడ ఎన్ని సినిమాని చేసిన సెపరేట్ గా ఒక ఇమేజ్ లేకపోతే మాత్రం కష్టం అవుతుంది.
ఇక ఇండస్ట్రీ లో ఏ ఇమేజ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ సపరేట్ ఇమేజ్ లేకపోవడం వల్లే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు.

ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోగా కొనసాగాలి అంటే మాత్రం మాస్ హీరో( Mass Hero )గా అవతారం ఎత్తాలి.అలా అయితేనే ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా ఆ హీరో కి మంచి అవకాశాలు వస్తాయి.అలాగే మార్కెట్ కూడా డౌన్ అవ్వదు.
ఇక మాస్ హీరోగా కొనసాగలేని వాళ్ళు కొన్ని ప్లాపులు వస్తే మాత్రం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోక తప్పదు.అందుకే ప్రతి సినిమా విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చేస్తూ ఉంటారు.
ఉదాహరణ ఇస్మార్ట్ శంకర్ సినిమా( Ismart Shankar )తో రామ్ మాస్ హీరోగా అవతారం ఎత్తాడు,ఈ సినిమా సక్సెస్ అవడంతో ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా రామ్ తో స్కంద అనే మాస్ సినిమా చేశాడు.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఒక మంచి హిట్ గా నిలుస్తూ మంచి వసూళ్లను కూడా రాబడుతుంది.

ఇక ఈ సినిమా ఇప్పటికే 25 కోట్ల వరకు కలక్షన్లను రాబట్టినట్టుగా తెలుస్తుంది.ఇక దీని తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ తో రామ్ ఇస్మార్ట్ శంకర్ సిక్వల్ గా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా సక్సెస్ అయితే రామ్ మాస్ హీరోగా( Ram Mass Hero ) ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతాడు.లేకపోతే మాత్రం మళ్ళీ క్లాస్ సినిమాలు చేసుకుంటూ ఉండాల్సిందే.
ఇక ఇప్పటికే మాస్ అవతారంలో రామ్ ని చూసిన చాలా మంది ఆయన యాక్టింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.చూడాలి మరి రామ్ మాస్ హీరో ఇమేజ్ ని కాపాడుకుంటాడా లేదా అనేది…