మిరియాలు( black pepper ).వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.
ప్రతి ఒక్కరి వంటింట్లోనూ మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి.మిరియాలను కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు.
అంటే మసాలా దినుసుల్లో మిరియాలే రారాజు.ఘాటైన రుచిని కలిగి ఉండే మిరియాలు వంటలకు చక్కని రుచి ప్రత్యేకమైన ఫ్లేవర్ ను అందిస్తాయి.
అలాగే ఆరోగ్యపరంగా మిరియాలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా రోజు ఉదయం మిరియాల పొడి, తేనె కలిపి తీసుకుంటే మీ శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
![Telugu Black Pepper, Blackpepper, Tips, Honey, Latest-Telugu Health Telugu Black Pepper, Blackpepper, Tips, Honey, Latest-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/09/black-pepper-Immune-System-honey-Knee-Pains-latest-news-health-health-tips-good-health-black-pepper-hone.jpg)
అవును అందుకోసం పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిలో వన్ టేబుల్ తేనె కలిపి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తే కనుక ఊపిరితిత్తుల్లో, గొంతులో పేరుకుపోయిన శ్లేష్మం కరిగిపోతుంది.జలుబు, దగ్గు, ఊపిరి సరిగ్గా ఆడక పోవడం, గొంతు నొప్పి, వాపు వంటి సమస్యలన్నీ ఎగిరిపోతాయి.అదే సమయంలో తేనె, మిరియాల పొడిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థ( Immune System )ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.
![Telugu Black Pepper, Blackpepper, Tips, Honey, Latest-Telugu Health Telugu Black Pepper, Blackpepper, Tips, Honey, Latest-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/09/honey-Knee-Pains-latest-news-health-health-tips-good-health-black-pepper-honey-health-benefits.jpg)
అలాగే రోజు ఉదయం తేనె, మిరియాల పొడి కలిపి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.అధిక కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.డైజీషన్ అద్భుతంగా సాగుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.
మోకాళ్ళ నొప్పులు ( Knee Pains ) మటుమాయం అవుతాయి.మిరియాల పొడి, తేనె కలిసి ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల.
అందులో ఉండే మెగ్నీషియం మరియు జింక్ స్త్రీ, పురుషుల్లో లైంగిక సమస్యలను దూరం చేస్తాయి.సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతాయి.
అంతేకాదు, మిరియాల పొడి, తేనె కలిసి తీసుకుంటే మధుమేహం, గుండె పోటు, క్యాన్సర్ వంటివి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.