'నా సామిరంగ'లో మరో యంగ్ హీరో.. నాగ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తాడా?

అక్కినేని నాగార్జున( Nagarjuna Akkineni ) ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు.

 Another Young Hero In Lead Role Nagarjuna Naa Saami Ranga, Nagarjuna Akkineni, T-TeluguStop.com

నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న తర్వాత కొద్దీ రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.ఇక ఈ మధ్యనే కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.

ఇటీవలే తన పుట్టిన రోజు నాడు కొత్త సినిమాను అనౌన్స్ చేసిన విషయం విదితమేనా సామిరంగ( Naa Saami Ranga )అనే టైటిల్ తో నాగార్జున ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఈ టీజర్ ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంది.

ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ అనిపించుకుని చాలా రోజుల తర్వాత ఈయన సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాడు.

Telugu Youngrole, Naa Saami Ranga, Raj Tarun, Vijay Binni-Movie

నాగ్ ఈ సినిమా కోసం మాస్ మేకోవర్ లోకి మారి పోయాడు.ఈ మేకోవర్ ఫ్యాన్స్ ను బాగా అలరించింది.2024 సంక్రాంతి బరిలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అని ఆ రోజే ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు.మరి ఈ సినిమా అప్పటి నుండి మరింత వేగంగా దూసుకు పోతుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సినిమాపై హైప్ పెంచేస్తునే ఉంది.

Telugu Youngrole, Naa Saami Ranga, Raj Tarun, Vijay Binni-Movie

ఇక తాజాగా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే.నాగార్జున సినిమాలో మరో యంగ్ హీరోకు కూడా ఛాన్స్ ఉందని టాక్.ఈ పాత్ర కోసం ఇటీవలే అల్లరి నరేష్ పేరు వినిపించగా ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు వినిపిస్తుంది.

మరి నాగ్ ఎనర్జీని మ్యాచ్ అయ్యేలా రాజ్ తరుణ్ రోల్( Raj Tarun ) ఎలా ఉండబోతుందో చూడాలి.కాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube