బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో ఈయన తెలియని వారు ఉండరు.విద్యార్థి నేత నుంచి మొదలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది.
అలాంటి బండి సంజయ్( BANDI SANJAY ) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.కరీంనగర్ లో పుట్టిన బండి సంజయ్ ముందుగా విద్యార్థి ఉద్యమ నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అలనాడు ఏబీవీపీ( ABVP ) విద్యార్థి నేతగా ఉన్న ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.ఇలా ఆయన పోరాటంలో ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్లారు.
అలాంటి బండి సంజయ్ మొదటిసారి 2005లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేట్ గా ఎన్నికై దాదాపు 14 సంవత్సరాలు కార్పొరేటర్ గా కొనసాగారు.ఇలాంటి బండి సంజయ్ 2014లో కరీంనగర్ శాసనసభ స్థానానికి పోటీ చేసిన కానీ గెలవలేక పోయారు.
ఆ తర్వాత 2018లో మళ్లీ పోటీ చేశారు అప్పుడు కూడా ఓడిపోయారు.
2019లో పార్లమెంటు స్థానానికి పోటీ చేసి 90 వేల మెజారిటీతో గెలుపొందారు బండి సంజయ్.ఈయన గెలుపు వచ్చేవరకు తెలంగాణలో బిజెపి అంటే అంతంత మాత్రమే.భారీ మెజారిటీతో గెలవడంతో బండి సంజయ్ బిజెపి( BJP ) అధిష్టానం దృష్టిలో పడ్డారు.
దీంతో 2020లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు.ఇక అప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రతి నియోజకవర్గంలో తన కేడర్ ను పెంచుకుంటూ వచ్చింది.
అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ ను( BRS ) గద్దె దించేది బిజెపి అనే స్థితికి తీసుకువచ్చారు.అలా బిజెపి పార్టీలోకి విపరీతంగా వలసలు పెరిగాయి.
పార్టీ మంచి పొజిషన్ లోకి వచ్చింది.ఇదే తరుణంలో బిజెపి పార్టీలో ఈటల రాజేందర్( Etela Rajender ) కూడా చేరారు.ఇక ఎలాగైనా బిజెపి తెలంగాణలో ఫామ్ అవుతుందనే పరిస్థితికి వచ్చింది.ఇంతలోనే కలహాలు పుట్టాయి.బిజెపిలో కూడా వర్గాలు ఏర్పడ్డాయి.ఈ గొడవ అంతా అధిష్టానం వద్దకు వెళ్లడంతో బిజెపిని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డికి( KISHAN REDDY ) బాధ్యతలు అందించారు.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అభిమానులంతా నిరాశకు గురయ్యారు.ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ నైరాశ్యంలో పడింది.
కార్యకర్తల్లో జోష్ లేక, బిజెపి మళ్లీ పాత పరిస్థితికి వచ్చింది.ఇంతలో ఒకటి రెండు పర్యటనలు చేసిన అమిత్ షా(AMIT SHAH) ఇది గమనించాడు.
ఎలాగైనా బండిని మళ్లీ బిజెపి రథసారథి చేస్తేనే రాబోవు ఎన్నికల్లో కాస్త మెరుగుపడుతుందని, అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది.అందుకే ఆయనతో వరుస బేటీలు ఏర్పాటు చేసి, బిజెపి అధ్యక్షుడిగా పగ్గాలు అందించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.