తెలుగు చిత్ర పరిశ్రమలు యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సుమ కనకాల( Suma Kanakala ) .ఈమె స్వస్థలం కేరళ అయినప్పటికీ తెలుగు భాషలో ఎంత స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు యాంకర్ గా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక సుమ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ వీరి దాంపత్య జీవితం గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారని విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ వీరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

ఇలా తమ దాంపత్య జీవితం( Rajeev Suma ) గురించి వివిధ రకాలుగా వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు సుమా లేదా రాజీవ్ కనకాల ఈ వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవాలేనని మేము చాలా సంతోషంగా ఉన్నామని ఈ వార్తలను ఖండిస్తున్నారు.ఇకపోతే తాజాగా సుమకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుమ తన పెళ్లి గురించి పలు విషయాలు తెలియజేశారు.
తనది కేరళ రాజీవ్ ది తెలంగాణ కావడంతో మా పెళ్లి జరిగే సమయంలో మేము కొన్ని కేరళ పద్ధతులను కూడా పాటించామని సుమ తెలియజేశారు.

ఇలా కేరళ సాంప్రదాయం( Kerala Tradition ) ప్రకారం మా పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ కూడా పచ్చిపాలు అరటిపండు ఒక స్పూన్ తినిపించాలి.అయితే మా పెళ్లి హైదరాబాద్లో జరిగినప్పటికీ మా అమ్మ కేరళ నుంచి దాదాపు 50 మంది బంధువులను పిలిపించారు.ఇలా పెళ్లికి వచ్చిన వారందరూ కూడా పచ్చిపాలతో పాటు అరటిపండు పెడుతూ ఉంటే రాజీవ్ మాత్రం తెగ కంగారు పడిపోయారు.
అందరూ వచ్చి అలా పెడుతూ ఉంటే ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారని ఇదెక్కడి సంప్రదాయం అంటూ ఇప్పటికీ ఆ విషయాన్ని తలుచుకొని భయపడుతూ ఉంటారు అంటూ వీరి పెళ్లిలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి సుమ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.