తమిళ నాడుకు చెందిన శాసన సభ్యులు ఉదయనిధి తలను నరికితే పది కోట్ల రూపాయల నగదు సుఫారి ప్రకటించి హత్య నేరానికి ప్రోత్సాహిస్తున్నా పరమ హంస ఆచార్యపై తక్షణమే హత్యాయత్నం కేసును నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్ చేశారు.బుధవారం నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మనోహర్ మాట్లాడుతూ సనాతన ధర్మం ముమ్మాటికి మనుషుల అసమానతలు సృష్టించిందని అందుకే రాజారాం మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి సామాజిక సంఘ సంస్కర్తలు పోరాటాలు చేశారని అన్నారు.
భర్త చనిపోతే భార్యను చితి మంటలలో వేసిన సనాతధర్మం ఆచారాలను దేశ ప్రజలు పాటించాల్సిన అవసరం లేదన్నారు.
సనాతన ధర్మం అంటే కేవలం బ్రాహ్మణీయ ఆధిపత్యశక్తుల ధర్మమేనని, సమధర్మమంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులని వారు చెప్పారు.
కుల, లింగ అసమానతలు పశువుల కంటే నీచంగా మనుషుల్ని చూసిన మానవీయ సంస్కృతి సనాతన ధర్మంలో ఉందన్నారు.ఈ అసమానతలు ఉన్న సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.
పరమహంస స్వామీజీ సత్యం, ప్రేమ, మానవీయతను ప్రచారం చేయాల్సి ఉండగా హత్యలు చేయించే హంతకులుగా మాట్లాడవద్దన్నారు తక్షణమే పరమహంసను అరెస్టు చేయాలన్నారు.ఒక భావం వ్యక్తం చేసినప్పుడు భౌతిక దాడుల ద్వారా, విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకొని ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు.
పరమహంస వ్యాఖ్యలను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలన్నారు.