యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్( Junior NTR ) నటన గురించి అందరికీ తెలిసిందే.ఎలాంటి సీన్ అయినా సరే తారక్ రఫ్ఫాడించేస్తాడు.
అయితే ఎన్.టి.ఆర్ నటన గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు చూడని వాళ్లు అతని ప్రతిభకు ఫిదా అవుతుంటారు.ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సైఫ్ అలి ఖాన్( Saif Ali Khan ) కూడా ఎన్.టి.ఆర్ టాలెంట్ గురించి తెలిసినా ప్రస్తుతం అతను దేవర సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు కాబట్టి ఎన్.టి.ఆర్ ఎనర్జీ, అతని వర్సటైల్ యాక్టింగ్ ని ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేస్తున్నాడట.అంతేకాదు కొన్ని కొన్నిసార్లు తారక్ నటన అతన్ని పిచ్చెక్కించేస్తుందని తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్ లోని ఈ ఎనర్జీకి కారణం అతనికి ఫ్యాన్స్ ఇచ్చే బూస్టింగే అని అతని సన్నిహితులతో చెబుతున్నాడట.అంతేకాదు దేవరలో భైరవ పాత్ర ఒప్పుకున్నందుకు సైఫ్ చాలా సంతృప్తిగా ఉన్నారట.ఎన్.టీఅర్ దేవర( Devara ) సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మరో సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నాడట.మొత్తానికి బాలీవుడ్ స్టార్ ని కూడా తన నటనతో ఫిదా చేశాడు తారక్.
ఎన్.టి.ఆర్ ఎనర్జీని చూసి ఎవరైనా సరే అతనికి ఫ్యాన్ అయిపోవాల్సిందే అంటూ ఫ్యాన్స్ కూడా సైఫ్ కామెంట్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.