రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన ఖుషి( Khushi ) సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుండగా సినిమా కోసం లీడ్ పెయిర్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలో జరిగిన ఓ స్పెషల్ చిట్ చాట్ లో విజయ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరని సమంతని అడగ్గా ఆమె అలియా భట్ అని చెప్పింది.
అది నిజమే అన్నట్టు విజయ్ దేవరకొండ తల ఊపాడు.అలియా భట్ బాలీవుడ్ సెన్సేషన్ పై విజయ్( Vijay Deverakonda ) కన్ను పడినట్టు తెలుస్తుంది.
ఆమె చేస్తున్న సినిమాలు ఆమె నటన విజయ్ ఆమెను ఇష్టపడేలా చేశాయని తెలుస్తుంది.
తెలుగులో కూడా RRR సినిమా చేసిన అలియా భట్( Alia Bhatt ) బ్రహ్మాస్త్ర కోసం కూడా ఇక్కడకు వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంది.రౌడీ హీరో విజయ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ అయిన అలియా భట్ తో అతను కలిసి ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటాడో చూడాలి.విజయ్ హీరోయిన్స్ లిస్ట్ లో కొత్తగా అలియా భట్ కూడా వచ్చి చేరింది.
ఎలాగు విజయ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి విజయ్ తో అలియా భట్ ని ఏదో ఒక సినిమాకు సెట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.