రాజన్న సిరిసిల్ల జిల్లా: అభం శుభం తెలియని 20 నెలల తల్లి దండ్రులు లేని చిన్నారి పాప అగుల్ల అహిద్య వింత చర్మ వ్యాధితో బారిన పడింది.ఇటీవల పాప తండ్రి భాస్కర్ గుండె పోటుతో మృతి చెందడంతో తల్లి అహిద్యను నానమ్మ సావిత్రి వద్ద వదిలేసి పుట్టింటికి వెళ్లింది.
దీంతో నానమ్మ వద్ద పెరుగుతున్న ఆహిద్య కు వీపు వెనుకాల చర్మం నల్ల బడి అందులోనుండి వెంట్రుకలు మొలుస్తున్నాయి.
పాపకు వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న నానమ్మ దుస్థితిని తెలుసుకున్న ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపిటిసి ఒగ్గు బాల్ రాజు యాదవ్ 2 వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందించారు.
పాపను చర్మ వ్యాధి నిపుణులైన డాక్టర్ కు చూపించాలని కోరారు.అలాగే పాప ఆరోగ్యం బాగు చేయించడానికి దాతలు ముందుకు వచ్చి 9441102435 కు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయము అందించాలని తెలిపారు.