రాజన్న సిరిసిల్ల జిల్లా: తోడ బుట్టి కూడా పెరిగిన తమ్ముడు అకాల మరణం చెందగా తన తమ్ముడి పేరు చిరస్థాయిగా ఎప్పుడు జనాల్లో ఉండాలనే ఉద్దేశంతో అతడి అక్కా బావ ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్ లో అన్నదానం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంనకు చెందిన మెగి రాజు – జ్యోతి దంపతులు జ్యోతి తమ్ముడు మానకొండుర్ గ్రామానికి చెందిన నూగురి విజయ్ 11 వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞ్యాపకార్డం డే కేర్ సెంటర్ లో ఉంటున్న వృద్దులకు అన్నదానం చేశారు.
అదే విధంగా బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, రాజు ,జ్యోతి ల కూతురు సారిక,మమత పాల్గొన్నారు.