అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లు , ఆర్డీవో లు , అన్నీ ప్రభుత్వ జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రెవెన్యూ , పోలీస్ , పురపాలక , ఇరిగేషన్ , పంచాయితీ రాజ్ , వైద్యఆరోగ్య క్షేత అధికారులతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 Do Not Go Out Unless It Is Urgent Due To Rains Collector Anurag Jayanthi , Rain-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక సురక్షిత చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే నిండిన చెరువులు, కుంటల పరిస్తితి ని కనిపెట్టుకుని ఉండాలని సూచించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలన్నారు.

గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను ప్రతి పదిరోజులకు ఒకసారి తప్పకుండా శుభ్రం చేయాలని, సీజనల్ , కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్నీ చర్యలు చేపట్టాలని సూచించారు.

మంగళవారం , శుక్రవారం డ్రై డే చేపట్టాలని సూచించారు.పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా , అన్ని విధాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు మానేరు, మూలవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ మానేరు ప్రాజెక్టు , నిమ్మపల్లి ప్రాజెక్టు నిండి మత్తడి పోస్తుననందున మానేరు, మూలవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెల్లద్దు అని అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదని అన్నారు.మానేరు, మూలవాగు సరిహద్దు గ్రామాల సర్పంచ్ లు , కార్యదర్శులు మానేరు, మూలవాగు వద్దకు ప్రజలు వెళ్ళకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు .హెచ్చరిక ఫ్లెక్సీ లు పెట్టాలన్నారు .ప్రజలందరికీ తెలిసేలా గ్రామాల్లో టామ్ టామ్ చేయించాలన్నారు .గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశలలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు.ఇప్పటికే ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తున్న లో లెవెల్ వంతెనలు ఉన్న వాగుల వద్ద బారి కేడ్లు ఏర్పాటు చేశామన్నారు.

జిల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా,ప్రజలు వెంటనే స్థానిక రెవెన్యూ , పోలీస్ అధికారుల కు సమాచారం అందించాలన్నారు.కంట్రోల్ రూం ఫిర్యాదులు ,వినతుల పై వెంటనే స్పందించాలి వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫిర్యాదులు , వినతుల పై వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం, సమాచారం అందించేందుకు ప్రజలు కంట్రోల్ రూం నెంబర్ 9398684240 సంప్రదించాలన్నారు.24*7 గంటలు ఈ కంట్రోల్ రూం పని చేస్తుందన్నారు.అధికారులు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లొద్దు జిల్లాలో

భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు జిల్లా , క్షేత్ర అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.పరిస్థితి మెరుగు పడేవరకు చెరువుల, వాగుల వద్ద చేపలు పట్టడానికి, స్నానాలకు అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు.

వర్షాలు ముగిసే వరకూ స్థానికంగానే అందుబాటులో ఉంటూ వర్ష పరిస్థితిని కనిపెట్టుకొని ఉండాలన్నారు.కాచి వడబోసిన నీటినే త్రాగాలి వర్షాల నేపథ్యంలో ప్రజలు కాచి వడపోసిన నీటిని తాగాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.

తద్వారా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube