మణిపూర్ మంటల పాపం ఎవరిది ?

గనత వహించిన బారత ప్రజాస్వామ్యం సిగ్గు పడాల్సిన తీవ్ర సంగటనలు ఈశాన్య రాష్ట్రం మణిపూర్( Manipur ) లో జరుగుతున్నాయి .ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని జబ్బులు చర్చుకుంటున్న భారతావని లో మానవత్వానికి మాయని మచ్చలా జరిగిన ఇలాంటి సంఘటనలపై తీసుకోవలసిన స్థాయిలో చర్యలు వేగంగా జరగలేదన్నది మాత్రం స్పష్టం.

 Who Is Behind Manipur Violence,manipur Violence,manipur,kuki Women Incident,nirb-TeluguStop.com

గత 75 రోజులుగా అమానుష సంగటనలు జరుగుతున్నా వాటిని మిగతా ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవటమే తప్ప ఆ సంఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించడంలో గాని అలాంటి పరిస్థితులు పునరావతం కాకుండా తీసుకోవాల్సిన కట్టు దిట్టమైన భద్రతా చర్యలు విషయంలో గాని ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి అన్నది ఒప్పుకోవాల్సిన విషయం .

Telugu Central, Kuki, Manipur, Nirbhaya-Politics

ఇందులో మణి పూర్ ప్రభుత్వానికి( Manipur Government ) బాధ్యత ఎంత ఉంటుందో దేశ పౌరులను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కూడా అంతే ఉంటుంది .గొడవలకు మూల కారణం ఏదైనా సరే అది తీవ్ర రూపం దాల్చకుండా మత విద్వేషాలను, కుల సమీకరణాలను రెచ్చగొట్టి ప్రజల మానప్రాణాలను హరించే స్థాయికి విషయ తీవ్రత పెద్దదవుతున్నప్పుడు ప్రభుత్వాలను ముందుగా హేచ్చరించాల్సిన కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టే కదా ? తమ రాజకీయ ప్రయోజనాల కోసం తక్షణ అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న రాజకీయ నాయకులు ఇలాంటి సంఘటనలకు కచ్చితంగా బాధ్యత వహించాలి.గత 70 రోజులుగా అక్కడ జరుగుతున్న అమానుష సంఘటనలు( Manipur Violence ) బయటకు రాకుండా మీడియాను, ఇంటర్నెట్ ను కంట్రోల్ చేస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది.ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది కాబట్టి సుమోటగా తీసుకుంటానని బెదిరిస్తుంది కాబట్టే చర్యలు తీసుకుంటున్నట్టు ఉన్నారే తప్ప తనంతట తానుగా చట్టం ముందుకు వచ్చి పనిచేస్తున్నట్టుగా పరిస్థితి కనిపించడం లేదు

Telugu Central, Kuki, Manipur, Nirbhaya-Politics

అసలు మనుషులంటూ ఉంటేనే కదా రాజ్యాలైనా అధికారాలైనా ఎవరైనా నిలబెట్టుకునేది సమాధుల్ని ఎవరు పరిపాలించలేరు కదా? అభివృద్ధి లోను మౌలిక సదుపాయాలు కల్పనలోనూ ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఆ దేశ పౌరుల దన మాన ప్రాణాలను రక్షించే చర్యలు ప్రథమ కర్తవ్యం గా ఏ ప్రబుత్వానికి అయినా ఉండాలి .అంతే తప్ప అనుకూల వర్గాలకు చట్టం ఒకలాగా వ్యతిరేక వర్గాలకు ఒక లా గా వర్తించేలా పావులు కదుపుతున్న ప్రభుత్వాలు పనితీరును గర్హించాల్సిందే .ఈ సంఘటన పట్ల వస్తున్న స్పందనలు కూడా ఆశించిన మేరకు లేవు.నిర్భయ సంఘటన( Nirbhaya ) జరిగినప్పుడు దేశం మొత్తం అట్టుడికి పోయింది.

అయితే అంతకు మించిన సంఘటనల విషయంలో మాత్రం దేశ యువత నుంచి ఆశించే స్థాయి స్పందన కూడా రావటం లేదు.బాధ్యులు పట్ల స్పందనలు బాధితుల కులం మతం ప్రాతిపదిక స్పందించే స్థాయికి పరిస్థితులు మారిపోయినట్లే కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube