ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్( Reels, shorts ) బాగా పాపులర్ అయిపోయాయి.వీటిని చూసేందుకు యువత తెగ ఆసక్తి చూపుతుంది.
రోజుకి గంటల కొద్ది సోషల్ మీడియాలో గడుపుతూ రీల్స్, షార్ట్ వీడియోలను చూస్తూ ఎంటర్‌టైన్ అవుతున్నారు.అలాగే చాలామంది రీల్స్, షార్ట్స్ వీడియోల ద్వారా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లలో పాపులర్ అవుతున్నారు.
ఇటీవల అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లలోనూ రీల్స్ ఫీచర్ వస్తుంది.
ఇక కొంతమంది చూడటమే కాదు.వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు.ఇక మరికొంతమంది యువత దీనిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు.
ఆసక్తి కలిగించే లేదా మంచి సబ్జెక్ అందించే వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించడమే కాకుండా యూజర్లను ఆకట్టుకుంటున్నారు.అయితే మరికొంతమంది రీల్స్ పిచ్చిలో పడి సాహసాలు చేస్తూ ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు.
సోషల్ మీడియాలో రీల్స్( Reels on social media ) ద్వారా త్వరగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో రకరకాల ఫీట్లు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న విషాదకర ఘటనలు( Tragic events ) అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా అలాంటి ఒక ప్రమాదకర సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది.ఒక యువకుడు రైలు పట్టాలపై నిలబడి రీల్ చేస్తున్నాడు.
ట్రైన్ దగ్గరకు రాగానే వెంటనే పక్కకు తప్పుకున్నాడు.అయితే బోగీ యువకుడి తలకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ వీడియో గగుర్పాటుకు గురి చేస్తోంది.ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయవద్దని యువకులను హెచ్చరించారు.సోషల్ మీడియలో వైరల్ అయిేతే అదేదో గొప్పగా ఫీల్ అవుతున్నారని, వింత చర్యలకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు.
ప్రాణాలు ముఖ్యమని సజ్జనార్ ట్వీట్ చేశారు.