టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో సనా ఖాన్(Sana khan ) ఒకరు.సనా ఖాన్ తెలుగులో తక్కువ సినిమాలలోనే నటించినా ఆ సినిమాలతో సనా ఖాన్ క్రేజ్ ను పెంచుకున్నారు.
తాజాగా సనా ఖాన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.నిన్న ఉదయం ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వగా సనా ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
2005 సంవత్సరంలో సనా ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన కత్తి మూవీ( Kathi )లో సనా ఖాన్ నటించారు.
తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో సనా ఖాన్ నటించి ఆ సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకున్నారు.మిస్టర్ నూకయ్య సినిమాలో హీరోను చీట్ చేసే పాత్రలో నటించి సనా ఖాన్ ప్రశంసలను సొంతం చేసుకోవడం గమనార్హం./br>
వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలోనే సనా ఖాన్ గుడ్ బై చెప్పడం గమనార్హం.మూడేళ్ళ క్రితం సనా ఖాన్ అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం ఈ ప్రముఖ నటి సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.తనకు కొడుకు పుట్టిన విషయాన్ని చెబుతూ సనా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం./br>
మీరందరూ మాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని సనాఖాన్ పేర్కొన్నారు.అభిమానుల దీవెనలు మా బిడ్డకు కావాలని సనాఖాన్ కామెంట్లు చేశారు.సనా ఖాన్ చేసిన పోస్ట్ కు 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.సనా ఖాన్ కు కెరీర్ పరంగా మంచి జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.హీరోయిన్ సనా ఖాన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.