మౌలిక వసతుల కల్పన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) గంభీరావుపేట రెండు పడక గదుల ఇండ్ల కాలనీల్లో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడానికి చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.సోమవారం గంభీరావుపేట మండల( Gambhiraopet ) కేంద్రంలోని బీసీ కాలనీలో 10 కోట్ల 56 లక్షల రూపాయలతో నిర్మించిన 168, ఎస్సీ కాలనీలో 6 కోట్ల 43 లక్షల రూపాయలతో నిర్మించిన 104 రెండు పడక గదుల ఇండ్లను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై ఆరా తీశారు.

 Speed Up Construction Of Housing Infrastructure Says District Collector Anurag J-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ( District Collector Anurag Jayanthi )మాట్లాడుతూ నిర్మించిన ఇండ్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా సిద్ధం చేయాలని అన్నారు.విద్యుత్, నీటి సదుపాయాల కల్పనపై ఆరా తీశారు.

కాలనీల్లో ఇండ్ల వెంబడి మొక్కలు నాటాలని సూచించారు.పగిలిపోయిన కిటికీల అద్దాల స్థానంలో కొత్తవి అమర్చాలని, నల్లా కనెక్షన్లు, వీధి దీపాలు అమర్చాలని అన్నారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామ సభ నిర్వహించి మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని తహశీల్డార్ ను ఆదేశించారు.కాలనీలను శుభ్రం చేయాలని ఎంపీడీఓ కు సూచించారు.

కలెక్టర్ వెంట పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష, ప్యాకేజీ – 9 ఈఈ శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ మధుసూధన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏఈ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube