ఘనంగా ముదిరాజ్ కులస్తుల పోచమ్మ బోనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.ముదిరాజ్ కులస్తుల కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకొని విగ్రహ ప్రతిష్ట చేసుకున్న తర్వాత ఆనవాయితీగా గ్రామ దేవత పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు.

 Mudhiraj Pochamma Bonalu Celebrations At Boinpally Mandal, Mudhiraj, Pochamma Bo-TeluguStop.com

ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉంటూ,ఇంటికో బోనం నేత్తిన పెట్టుకొని, బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య,శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా

పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి,ముక్కులు చెల్లించుకున్నారు.సందర్భంగా యువకులు డిజే చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ,పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం పోచమ్మ తల్లికి నైవేద్య సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ముదిరాజ్ కులస్తులనందరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంట పిల్లాపాప అందరూ బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube