ఘనంగా ముదిరాజ్ కులస్తుల పోచమ్మ బోనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.

ముదిరాజ్ కులస్తుల కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకొని విగ్రహ ప్రతిష్ట చేసుకున్న తర్వాత ఆనవాయితీగా గ్రామ దేవత పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉంటూ,ఇంటికో బోనం నేత్తిన పెట్టుకొని, బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య,శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి,ముక్కులు చెల్లించుకున్నారు.

సందర్భంగా యువకులు డిజే చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ,పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు.అనంతరం పోచమ్మ తల్లికి నైవేద్య సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ముదిరాజ్ కులస్తులనందరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంట పిల్లాపాప అందరూ బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు.

నిత్యం నైట్ ఈ మ్యాజికల్ ఆయిల్ ను రాసుకుంటే వద్దన్నా మీ స్కిన్ సూపర్ వైట్ గా మారుతుంది!