పిగ్ గాల్ బ్లాడర్‌తో గాయాలకు మందు.. భారత్‌లోనే ఇది తొలిసారి..

ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఎన్నో నూతన మార్పులు వస్తోన్నాయి.వైద్య రంగంలోకి ఎన్నో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి.

 Medicine For Wounds With Pig Gall Bladder This Is The First Time In India, Medic-TeluguStop.com

అతి ప్రమాదకరమైన కరోనా వైరస్ లాంటి దానికి కూడా కొద్దిరోజుల్లోనే వ్యాక్సిన్ కనిపెట్టారు.దీనిని బట్టి చూస్తే వైద్య, ఫార్మా రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవచ్చు.

కరోనా వైరస్ కే కాదు ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు మందులు వచ్చేస్తున్నాయి.సైంటిస్టులు( Scientists ) ఎన్నో పరిశోధనలు చేపట్టి డేంజరస్ జబ్బులను తగ్గించేందుకు మెడిసిన్స్, ఇంజెక్షన్లు తయారుచేస్తున్నారు.

Telugu Wounds, India, Time-Latest News - Telugu

అందులో భాగంగా తాజాగా పిగ్ గాల్ బ్లాడర్‌తో( pig gall bladder ) అయిన గాయాలను తగ్గించడానికి ఉపయోగపడే యంత్రాలను తయారుచేశారు.ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటిది ఎప్పుడు రాలేదని, తొలిసారి యంత్రాన్ని తయారుచేయడం ఇదేనని చెబుతున్నారు.కాలిన గాయాలను తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు.ఇప్పటివరకు గాయాలను తగ్గించడానికి అనేక పద్దతులు ఉన్నాయి.కానీ ఈ కొత్త పరికరం వల్ల కాలిన గాయాలను తగ్గించడమే కాకుండా వాటి మరకలను కూడా రూపుమాపవచ్చు.

Telugu Wounds, India, Time-Latest News - Telugu

ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా( Drug Controller of India ) ఈ యంత్రానికి అనుమతులు కూడా జారీ చేసింది.గత 15 ఏళ్లుగా ఈ యంత్రం తాయారుచేయడం కోసం ఎన్నో విధాలుగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారు.చివరిగా వారి రీసెర్చ్ విజయవంతం కావడంతో యంత్రం అందుబాటులోకి వచ్చింది.

ఇండియన్ మెడికల్స్ నిబంధనల ప్రకారం జంతువుల నుంచి తయారుచేసే మెడికల్ పరికరాలను ప్రాక్టికల్‌గా వర్క‌వుట్ చేయకూడదు.కానీ ఈ యంత్రం తయారీ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటివరకు శరీరంపై అయ్యే గాయాలను తగ్గించడానికి మెరుగైన పరికరాలు ఏమీ అందుబాటులో లేవు.ఉన్నవాటి వల్ల కూడా మెరుగైన ఫలితాలు రావడం లేదు.కానీ ఈ యంత్రం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube