'ఛత్రపతి' సినిమాని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..! ఎలాంటి ఛాన్స్ మిస్ అయ్యాడు పాపం

దర్శక ధీరుడు రాజమౌళి ( Rajamouli )తెరకెక్కించిన సినిమాలలో ఇప్పటికీ చూసిన కూడా రోమాలు నిక్కపొడుచుకునేలా చేసే చిత్రం ‘ఛత్రపతి( Chatrapathi )’.ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఇది.

 Ravi Teja Missed Chatrapathi Movie Details, Rajamouli , Prabahas , Chatrap-TeluguStop.com

ఈ సినిమాలో ఉన్నటువంటి ఫస్ట్ హాఫ్ , ఇప్పటి వరకు రాజమౌళి తీసిన అన్నీ సినిమాలకంటే కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు.ఫస్ట్ హాఫ్ మొత్తం మాస్ ఆడియన్స్ కి ఒక ఫెస్టివల్ లాగ ఉంటుంది.

ఇక సెకండ్ హాఫ్ అయితే సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపారేసాలగా ఉంటుంది.అప్పటి వరకు సాదాసీదా హీరోగా ఉన్న ప్రభాస్( Prabahas ) ని స్టార్ హీరో గా చేసింది ఈ చిత్రం.

ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.టాలీవుడ్ మాస్ హీరోలలో ఒకడిగా స్థిరపడిపోయాడు, అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో నెంబర్ గా నిలబడలేకపోయింది ఈ చిత్రం.

Telugu Chatrapathi, Prabahas, Rajamouli, Ravi Teja, Tollywood, Trisha, Varsham-M

ప్రభాస్ మూడవ చిత్రం ‘వర్షం‘ ఆరోజుల్లో 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.కానీ ఛత్రపతి చిత్రం కేవలం 14 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది.ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హై సెకండ్ హాఫ్ లో లేకపోవడమే అందుకు కారణం.అయితే ఈ సినిమాని తొలుత రాజమౌళి మాస్ మహారాజ రవితేజ( Ravi teja ) తో చేద్దాం అనుకున్నాడట.

కానీ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే అలవాటు ఉన్న రవితేజ కాల్ షీట్ డైరీ మొత్తం నిండిపోయింది.దాంతో ఈ చిత్రాన్ని ప్రభాస్ తో చేద్దాం అనుకున్నాడు రాజమౌళి.

కానీ ఆయన దగ్గరకి వెళ్ళాలి అంటే భయం.ఎందుకంటే గతం లో ఆయన స్టూడెంట్ నెంబర్ 1 మరియు సింహాద్రి సినిమాలను ఇలాగే రిజెక్ట్ చేసాడు.ఇప్పుడు కూడా అలాగే రిజెక్ట్ చేస్తాడు, పొయ్యి వేస్ట్ అని అనుకున్నాడట.కానీ ఒకరోజు ప్రభాస్ తన బర్త్ డే పార్టీ కి టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు నిర్మాతలను ఆహ్వానించాడట.

Telugu Chatrapathi, Prabahas, Rajamouli, Ravi Teja, Tollywood, Trisha, Varsham-M

అలా ఆహ్వానం అందుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకడు.ఎలాగో వచ్చాము కదా అడిగేద్దాం అని నా దగ్గర ఒక స్టోరీ ఉంది, నీకు సరిగ్గా సరిపోతుంది వింటావా అని ప్రభాస్ ని అడిగాడట రాజమౌళి.హా రేపే వచ్చే డార్లింగ్ స్టోరీ సిట్టింగ్ వేద్దాం అన్నాడట.ఆ మరుసటి రోజు రాజమౌళి ప్రభాస్ ఇంటికి వెళ్లి స్టోరీ చెప్పడం, ఆయనకీ తెగ నచ్చి వెంటనే ఓకే చెయ్యడం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ మన తెలుగు సినిమాకి ఐడెంటిటీ గా మారిపోయింది.అలా ఛత్రపతి చిత్రం ప్రారంభం అవ్వడం వెనుక ఇంత పెద్ద స్టోరీ దాగి ఉంది, ఒకవేళ రవితేజ చేసి ఉంటే ఈ సినిమా ఆయనకీ మరింత సహాయ పడేది.

ఈ చిత్రం తర్వాత వెంటనే రవితేజ తో రాజమౌళి విక్రమార్కుడు సినిమా చేసాడు.అది ఛత్రపతి కంటే పెద్ద హిట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube