యాదాద్రి భువనగిరి జిల్లా:రోటరీ క్లబ్ ఆఫ్ యాదగిరిగుట్ట మరియు భువనగిరి సెంట్రల్ వారి ఆధ్వర్యంలో గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని( Cancer camp ) ఏర్పాటు చేశారు.రోటరీ క్లబ్ గవర్నర్ , తాళ్ల రాజశేఖర్ రెడ్డి,యాదాద్రి ఆలయ ఈఓ జి.
గీతారెడ్డితో కలిసిఈ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి స్టేజీలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే తగ్గే అవకాశం ఉందన్నారు.
అలాగే యాదాద్రి ఆలయ ఈఓ గీతారెడ్డి ( EO Geetha Reddy )మాట్లాడుతూ పన్నెండు వేలు విలువచేసే క్యాన్సర్ టెస్టును ఉచితంగా అందజేయడం సంతోషకరమని అన్నారు.ఉచిత శిబిరానికి హాజరైన100 మందికి పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి సెంట్రల్ అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి,యాదగిరిగుట్ట క్లబ్( Yadagirigutta Club ) అధ్యక్షులు దీకొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.