టీలో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా?

చియా సీడ్స్( Chia seeds ).వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

 Wonderful Health Benefits Of Consuming Black Tea With Chia Seeds! Black Tea, Tea-TeluguStop.com

ఆరోగ్యమైన గింజల్లో చియా సీడ్స్ ముందు వరుసలో ఉంటాయి.చియా సీడ్స్ లో మినరల్స్, విటమిన్స్, ఫైబర్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇటీవల రోజుల్లో చియా సీడ్స్ ను విరివిగా వినియోగిస్తున్నారు.

చియా సీడ్స్ ను ఎలాగైనా తీసుకోవచ్చు.

Telugu Black Tea, Chia Seeds, Chiaseeds, Tips, Latest-Telugu Health

ముఖ్యంగా టీలో కలిపి చియా సీడ్స్ ను తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.అవును ఉదయం ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మిక్స్ చేసి సేవించాలి.ఇలా బ్లాక్ టీలో చియా విత్తనాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

వెయిట్ లాస్( Weight loss ) కావాలనుకునేవారు ఈ విధంగా ట్రై చేయండి.రోజు మార్నింగ్ బ్లాక్ టీలో చియా సీడ్స్ కలుపుకుని తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

క్యాలరీలు త్వరగా కరుగుతాయి.వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు సైతం మాయం అవుతుంది.

Telugu Black Tea, Chia Seeds, Chiaseeds, Tips, Latest-Telugu Health

అలాగే బ్లాక్ టీలో చియా సీడ్స్ కలిపి రోజు మార్నింగ్ తీసుకుంటే రిఫ్రెషింగ్ గా ఉంటుంది.ఒత్తిడి, టెన్షన్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మెదడు చురుగ్గా మారుతుంది.

బ్లాక్ టీలో చియా సీడ్స్ కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.అందువల్ల బ్లాక్ టీలో చియా సీడ్స్ ను కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.

వయసు పైబ‌డిన మోకాళ్ల నొప్పులు( Knee Pains ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మధుమేహులకు కూడా చియా సీడ్స్ చాలా మేలు చేస్తాయి.

పైన చెప్పిన విధంగా రోజు వీటిని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.అంతేకాదు బ్లాక్ టీలో చియా సీడ్స్ ను కలిపి తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.మలబద్ధకం సమస్య ఉన్నా పరార్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube