సూర్యాపేట జిల్లా: రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని,రైతులెవరూ అధైర్య పడొద్దని,అండగా ఉంటామని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు అన్నారు.ఆదివారం కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గుడిబండ,గణపవరం, తొగర్రాయి,తమ్మరబండ పాలెం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల సెంటర్లను సిబ్బందితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు 90 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మిగతా పది శాతం కూడా వీలైనంత తొందరగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తామన్నారు.
తాలు,తేమలేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి సహకరించాలన్నారు.
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచుకొని సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వట్టే సీతారామయ్య,బుర్ర చంద్రమౌళి,సిబ్బంది వీరబాబు,పవన్, సురేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు,రైతులు పాల్గొన్నారు.