సూర్యుడు నుంచి ఏడవ గ్రహమైన యురేనస్ ( Uranus ) తన ప్రత్యేకమైన లక్షణాలతో ఎప్పుడూ కూడా ఆకట్టుకుంటూనే ఉంటుంది.దీనికి ఏరియల్, అంబ్రియల్, టైటానియా, ఒబెరాన్ అనే నాలుగు అతిపెద్ద మూన్స్ ( Moons ) ఉన్నాయి.
అయితే నాసా శాస్త్రవేత్తలు( NASA ) నిర్వహించిన కొత్త పరిశోధనలో ఈ చంద్రుల గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి.వాటి మంచు క్రస్ట్‌ల క్రింద లోతైన మహాసముద్రాలు( Oceans ) ఉండవచ్చని నాసా తాజా అధ్యయనం సూచించింది.
గత అధ్యయనాలు యురేనస్ గ్రావిటేషనల్ పుల్ ద్వారా ఉత్పన్నమయ్యే వేడి ఈ చంద్రులకు సముద్రాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని అందించలేదని భావించాయి.అయితే, ఈ కొత్త పరిశోధన ఈ చంద్రులలోని రాకీ మాంటిల్స్ వేడి ద్రవాన్ని విడుదల చేయడం ద్వారా ఉష్ణ మూలాన్ని అందించవచ్చని చెప్పుకొచ్చింది.
ఇది వెచ్చని సముద్ర వాతావరణాలను నిర్వహించడానికి సహాయపడుతుందని వివరించింది.

టైటానియా, ఒబెరాన్ జీవులు నివసించేందుకు మద్దతు ఇచ్చేంత వెచ్చగా ఉండే సముద్రాలను కూడా కలిగి ఉండవచ్చని అధ్యయనం సూచిస్తుంది.అలానే చంద్రుల ఉపరితలాలు సముద్రానికి ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన ఇంటర్నల్ హీట్ నిలుపుకోవడానికి తగినంతగా ఇన్సులేట్ అయి ఉంటాయని స్టడీ తెలిపింది.ఇక ఈ చంద్రుల మహాసముద్రాలలో యాంటీఫ్రీజ్‌గా పనిచేసే అమ్మోనియా, క్లోరైడ్‌లు, అదనపు యాంటీఫ్రీజ్ లక్షణాలను అందించే లవణాలు సమృద్ధిగా ఉండవచ్చని అధ్యయనం వెల్లడించింది.

ఈ మహాసముద్రాల కూర్పును అర్థం చేసుకోవడం ద్వారా చంద్రుల మంచు ఉపరితలాలపై కనిపించే పదార్థాలు ఏంటనేవి తెలుసుకోవచ్చు.అలానే ఇది భవిష్యత్ అన్వేషణ మిషన్లకు మార్గనిర్దేశం చేస్తుంది.కొత్త పరిశోధనలు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చంద్రులను సర్వే చేయడానికి, వాటి లోతైన లోపలి భాగాలను ద్రవం కోసం పరిశీలించడానికి మెరుగైన పరికరాలను రూపొందించడంలో సహాయపడతాయి.ఇక యురేనస్ పెద్ద చంద్రులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా అధ్యయనాలు చేయాల్సి ఉంది.







