బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IVRI)కి చెందిన సీనియర్ సైంటిస్టులు గోమూత్రం( Cow Urine ) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు.వారు ఆవు మూత్రంపై గత నాలుగేళ్ల పాటు అధ్యయనం చేశారు.
ఆ అధ్యయనంలో మానవులకు మేలు చేసే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు గోమూత్రంలో ఉన్నాయని కనుగొన్నారు.ఈ అధ్యయనాన్ని తొమ్మిది మంది శాస్త్రవేత్తల బృందం చేపట్టింది.
ఈ స్టడీలో సాహివాల్, తార్పార్కర్ అనే రెండు దేశీయ ఆవుల నుంచి 14 మూత్ర నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.అదే సమయంలో వాటిని సంకరజాతి నమూనాలతో పోల్చారు.
తాజా మూత్రంలో బాక్టీరియా కలుషితమయ్యే అవకాశం ఉన్నందున అలా జరగకుండా సంవత్సరంలోని వివిధ సీజన్లలో గోమూత్రం శాంపుల్స్ తీసుకున్నారు.వీటి నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేసిన రూపాన్ని స్టడీ చేశారు.
ఆ తర్వాత ఆవు మూత్రం మానవులకు ప్రమాదకరమని ఇంతకుముందు చేసిన వాదనలను ఖండించారు.స్టడీలో తేలిన విషయాల ప్రకారం ఆవు మూత్రం సారాలలో ఔషధ గుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సంకరజాతి ఆవుల కంటే సాహివాల్, థార్పార్కర్ జాతుల మూత్రం బ్యాక్టీరియాను చంపడంలో ప్రభావవంతంగా ఉంటుందని వీరు కనుగొన్నారు.ఆవు మూత్ర సారం E.coli, సాల్మోనెల్లా జాతులు, సూడోమోనాస్ ఎరుగినోసా, లిస్టెరియా మోనోసైటోజెన్స్, బాసిల్లస్ సెరియస్, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి నశింపజేస్తుందని పేర్కొన్నారు.ఆవు మూత్ర సారం ఈస్ట్‌లకు వ్యతిరేకంగా యాంటీ ఫంగల్( Antifungal Properties ) ప్రభావాలను తగ్గిస్తుందన్నారు.

2018లో మరో ఎనిమిది మంది శాస్త్రవేత్తలతో ప్రారంభమైన ఈ అధ్యయనానికి IVRIలోని శాస్త్రవేత్త రవికాంత్ అగర్వాల్ నాయకత్వం వహించారు.ఆవు మూత్రంలో ఔషధ, వైద్య గుణాలు పుష్కలంగా ఉన్నాయని వీరు కనుగొన్నారు.ఆవు మూత్ర సారంలో కనిపించే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మానవులు, జంతువులలో ఇన్ఫెక్షన్లకు( Cure Infections ) నయం చేయడంలో దోహదపడచ్చని వీరి అధ్యయనం ప్రకారం తెలుస్తోంది.







