టీడీపీపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టును టీడీపీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.ఈ క్రమంలో ఎవరెన్ని కుట్రలు చేసినా మీ బిడ్డను ఏమీ చేయలేరని చెప్పారు.
తమ మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్టలో వేశారని విమర్శించారు.ఇచ్చిన హామీల్లో 97 శాతం అమలు చేశామన్నారు.
మరోవైపు పెత్తందార్లకు వంతపాడే పార్టీ ఉందన్న జగన్ గత ప్రభుత్వ పాలనను, ఇప్పటి పాలనను గమనించాలని సూచించారు.ప్రజలకు మంచి జరిగితే తనను ఆశీర్వదించాలని కోరారు.