వైరల్: ఒంటికాలితో రోడ్డు దాటుతున్న బాలిక.. ఇంతలోనే షాకింగ్ ఘటన!

సోషల్ మీడియాలో అనునిత్యం వందల, వేల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతూ ఉంటాయి.

 Viral A Girl Crossing The Road With One Leg Meanwhile , A Shocking Incident, Sin-TeluguStop.com

మిగిలినవి ఆన్లైన్ సర్వెర్ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి.ఇక వైరల్ అయిన వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

మరికొన్ని వింతగా అనిపిస్తే, కొన్ని చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఆ ఎమోషనల్ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే, ఓ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ ఆగి ఉన్నాయి.ఆ సమయంలో చాలా మంది అక్కడ రోడ్డు దాటుతున్నారు.వాళ్లలో ఓ బాలిక( A girl ) కూడా రోడ్డు క్రాస్ చేయడం చూడవచ్చు.

అయితే ఆమె తన అంగవైకల్యం చేత ఒక కాలితోనే కుంటుకుంటూ నడుస్తోంది.ఆమె రోడ్డు సగం దాటే సరికి గ్రీన్ సిగ్నల్ పడింది.ఆమెతో పాటు నడుస్తున్న వారు వేగంగా పరిగెత్తుకుంటూ రోడ్డు దాటేయగా ఆ బాలిక మాత్రం రోడ్డు దాట లేకపోయింది.దాంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నాయి.

ఇంతలోనే అద్భుతం జరిగింది.ఓ మహిళ( Women ) ఆ బాలిక దగ్గరకు వచ్చి ఆమెని ఆదుకుంది.ఆ బాలికను వీపుపై వేసుకొని ఆ రోడ్డు చివరివరకు మోసింది.ఈ క్రమంలో ఓ కారు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవగా కాసేపు ఆగాలని ఆమె సైగ కూడా చేసింది.

కాగా ఈ ఇన్స్పిరేషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఇప్పటివరకు 57 లక్షల మంది వీక్షించగా 69 వేల మంది లైక్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆ మహిళను మెచ్చుకుంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube