దేశం కోసం, దేశభక్తిపై ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి.బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
మనుషులందరరిని ఒక్కటి చేసేదే దేశం.ఇక దేశంపై సినిమా వస్తుందంటే చాలు భారీగా అంచనాలు ఉంటాయి.
తాజాగా ఒక తెలుగు సినిమా ఇదే జోనర్ లో వచ్చి ఆస్కార్ సైతం సంపాదించుకుంది.ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిపై వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఖడ్గం:( khadgam ) స్వాతంత్ర దినోత్సవం రోజు టీవీలో వచ్చే చిత్రాల్లో ఖడ్గం కచ్చితంగా ఉండాల్సిందే.ఖడ్గం సినిమా ఎన్ని సార్లు చూసిన అదే ఫీల్ ఉంటుంది.
ఈ సినిమా 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు.దాని ఆధారంగా తీశారు దర్హకుడు కృష్ణవంశీ.
ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి వింటూనే ఉంటారు.ఈ సినిమాలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సినిమా చూస్తున్నంతసేపు దేశభక్తి మరింత పెరుగుతూనే ఉంటుంది.

మేజర్:( Major ) భారీ అంచనాల మధ్య వచ్చిన మేజర్ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.ఈ సినిమాలో అడవిశేష్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ క్యారెక్టర్ గా నటించారు.ముంబై ఉగ్రదాడుల్లో ఏం జరిగింది అనేది దర్శకుడు శశికిరణ్ తిక్కా అద్భుతంగా చూపించారు.

RRR: ( rrr )ఈ సినిమా గురించి, ఈ సినిమా సృష్టించిన సునామి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా ఆస్కార్ ని కూడా సంపాదించి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టిఆర్ నటించగా ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించారు.అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.

భారతీయుడు: ( bharateeyudu )సినిమా వచ్చి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఈ సినిమా ఇప్పటికి చాలా మంది ఫేవరెట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించగా, కమల్ అద్భుతమైన నటనతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది.

ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్: ( The Legend of Bhagat Singh )భగత్ సింగ్ గురించి ఈ చిత్రం ఉంటుంది.ఈ సినిమాలో భగత్ సింగ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ నటించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

గదర్- ఏక్ ప్రేమ్ కథ:( Gadar- Ek Prem Katha )ఈ సినిమా ఒక గొప్ప ప్రేమ కథగా వచ్చి భారీ విజయం సాధించింది.విభజన, హిందూ-ముస్లిం అల్లర్ల సమయంలో జరిగిన ప్రేమకథగా దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తీశారు.ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ కొట్టింది.