జబర్దస్త్( Jabardast ) షో ద్వారా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లితెర మీద వచ్చిన క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై ఛాన్స్ లు అందుకున్నాడు.కొన్ని సినిమాల్లో కామెడీ రోల్స్ చేసిన అతను హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.
అయితే హీరోగా నిలదొక్కుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.సుధీర్( Sudhir ) చేసిన నాలుగు సినిమాల్లో ఒకటి పర్వాలేదు అనిపించుకుంది.
అయితే నెక్స్ట్ సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ గా రాబోతుందని తెలుస్తుంది.
ఇదిలాఉంటే సినిమా హీరోగా చేస్తూ జబర్దస్త్ ఏం చేస్తామని అతను ఆ షో కూడా వదిలేశాడు.
అయితే సుధీర్ రాకకోసం జబర్దస్త్ షో ఎదురు చూసినా సరే అతను వెనక్కి రాలేదు.అయితే ఏడాది తర్వాత మళ్లీ సుధీర్ ఈటీవీలో( ETV ) ఒక సరికొత్త షోతో ఎంట్రీ ఇచ్చాడు.
మల్లెమాల టీంలోకి మళ్లీ సుధీర్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.సుధీర్ చేస్తున్న ఈ షో వల్ల అతనికి మరింత క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.అయితే సినిమాలు వరుసగా లేకపోవడం వల్ల పాకెట్ మనీ కోసం ఈ షో చేయాల్సి వస్తుందని టాక్.సుధీర్ సినిమాలు చేస్తూనే ఇది కూడా చేయడం బెటర్ అని అనుకున్నాడని చెబుతున్నారు.
మరి ఈ ఒక్క షోకే ఉంటాడా పూర్తిగా మళ్లీ బుల్లితెర మీద రెగ్యులర్ గా కనిపిస్తాడా అన్నది చూడాలి.