బన్నీ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినట్టు అధికారికంగా ప్రకటన రాకపోయినా ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని సురేందర్ రెడ్డి( Surender Reddy ) ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే బన్నీ అభిమానులు( Allu Arjun Fans ) మాత్రం పుష్ప1, పుష్ప2 తర్వాత బన్నీ కెరీర్ పరంగా ఎలాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదని వెల్లడిస్తున్నారు.
మాకు మరో ఏజెంట్ ( Agent ) వద్దని బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాకు ఏజెంట్ 2 వద్దని నెటిజన్లు ఎలాంటి మొహమాటం లేకుండా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రకటన వెలువడింది.రిలీజైన మూడు వారాలకే ప్రముఖ ఓటీటీలలో ఒకటైన సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తక్కువ సమయంలోనే ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఈ మూవీని థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించడం లేదు.
రేసుగుర్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆ తరహా సినిమాలను తెరకెక్కించకుండా ఎందుకు రిస్కీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.స్పై థ్రిల్లర్ సినిమాలు మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.బన్నీ కథలు వింటున్నా కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించడం లేదనే సంగతి తెలిసిందే.
బన్నీ సురేందర్ రెడ్డి కాంబినేషన్ గురించి అధికారికంగా ప్రకటన వస్తే మాత్రం ఆయన విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో బన్నీ నటించడం ఇష్టం లేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అఖిల్ ఏజెంట్ సినిమా రిజల్ట్ వల్ల సురేందర్ రెడ్డి అక్కినేని అభిమానులకు సైతం దూరమయ్యారు.