మరో తెలుగు సినిమాలో 'సీతారామం' బ్యూటీ... ఈసారి కూడా నిరాశే

హిందీ ప్రేక్షకులను బుల్లి తెర సీరియల్స్ మరియు కార్యక్రమాలు తో అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ).ఈ ముద్దు గుమ్మకు హిందీలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించే అవకాశాలు లభించాయి.

 Sitaramam Heroine Mrunal Thakur One More Telugu Film , Flim News, Mrunal Thakur,-TeluguStop.com

హిందీలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మను తెలుగులో సీతారామం( Sitaram ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు దర్శకుడు హను రాగవపూడి మరియు నిర్మాత అశ్వినీదత్‌ ( Ashwinidat )లు తీసుకొచ్చారు.దుల్కర్ సల్మాన్ కి జోడిగా ఆ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ ముద్దుగుమ్మ తదుపరి సినిమాల విషయానికి వస్తే తెలుగులో పెద్దగా అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతుంది.ఇప్పటి వరకు నానితో కలిసి ఒక సినిమా నటించేందుకు సైన్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో యంగ్ హీరోతో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఇన్నాళ్లు వెయిట్ చేసిన ముద్దుగుమ్మకు అలాంటి ఆఫర్స్ రావాలంటే ఇంకాస్త సమయం వెయిట్ చేయాలి.మరిన్ని సక్సెస్ లు రావాలని గుర్తించినట్లు ఉంది.

అందుకే చిన్న హీరోలతో నటించేందుకు ఓకే చెప్పింది.

నాని తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మృణాల ఠాకూర్ మళ్లీ అదే స్థాయి హీరో తో నటించేందుకు ఓకే చెప్పింది.స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు వస్తాయనే ఎదురు చూసిన ఈమెకి మొండి చేయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు అయినా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశం వస్తుందా అనేది చూడాలి.

ఒక వైపు తెలుగులో నటిస్తూనే మరో వైపు హిందీలో వరుసైన సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు హిందీ సినిమాలు ఉన్నాయి.ఇక తమిళం నుండి కూడా ఈమెకు ఆఫర్స్ వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

భవిష్యత్తులో తమిళ సినిమాలు ఇమేజ్ చేస్తే అవి దేశ వ్యాప్తంగా విడుదల అయ్యే అవకాశాలు లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube