అంటారియోలో హిందూ ఆలయ ధ్వంసం.. సీరియస్‌గా తీసుకున్న కెనడా సర్కార్, నిందితుల కోసం సెర్చింగ్

గడిచిన కొన్ని నెలలుగా కెనడాలో( Canada ) హిందూ దేవాలయాలను కొందరు టార్గెట్ చేసి ధ్వంసం చేయడమో లేదంటే ఆలయ గోడలపై పిచ్చిరాతలు రాయడమో చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలను సహించేది లేదని భారత ప్రభుత్వం సైతం కెనడాకు తేల్చిచెప్పింది.

 Canada Authorities Looking For 2 Suspects Involved In Ontario Temple Vandalisat-TeluguStop.com

దీంతో కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు అంటారియో నగరంలోని హిందూ దేవాలయంలో జరిగిన విధ్వంసాన్ని ద్వేషపూరిత ఘటనగా అనుమానిస్తున్నాయి.ఆలయ ధ్వంసంలో పాల్గొన్న నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.

ఇందుకోసం సీసీ కెమెరా ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నారు పోలీసులు.అంటారియాలోని విండ్సర్ పట్టణంలో వున్న బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ్( Shri Swami Narayan ) మందిరాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.

సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఒకరు ఆలయ గోడలపై గ్రాఫిటీతో పిచ్చిరాతలు రాస్తుండగా, మరొకరు పరిసరాలను గమనిస్తున్నారు.వీరిద్దరూ నల్లటి దుస్తులు వేసుకుని, మాస్క్‌లు ధరించి కనిపించారు.

భవనం వెలుపలి గోడలపై భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక గ్రాఫిటీని అధికారులు కనుగొన్నారు.ఈ ఘటనపై బీఏపీస్ సంస్థ( BAPs organization ) ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.

ఆలయ గోడలపై భారత వ్యతిరేక గ్రాఫిటీని చూసి తాము ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.దీనిపై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన చెప్పారు.

Telugu Canada, Gauri Shankar, Jarnailsingh, Khalistan, Ontario Temple, Shri Swam

కాగా.కెనడాలో గతేడాది జూలై నుంచి ఆలయాలపై పిచ్చిరాతలు రాసిన ఘటనల్లో ఇది ఐదవది.ఈ ఏడాది ఫిబ్రవరి 14న జీటీఏలోని మిస్సిసాగా పట్టణంలోని శ్రీరామ మందిరాన్ని టార్గెట్ చేసిన దుండగులు.భారత్‌పై పిచ్చిరాతలు రాశారు.ఖలిస్తాన్ ఉద్యమ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను( Jarnail Singh Bhindranwale ) అమరవీరుడుగా కీర్తించారు.అంతకుముందు జనవరి 30న బ్రాంప్టన్‌లోని గౌరీశంకర్ ( Gauri Shankar )మందిరాన్ని కూడా ఇలాగే అపవిత్రం చేశారు.

గతేడాది సెప్టెంబర్‌లో టోరంటోలోని బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ్ మందిర్ ముందు ద్వారా వద్దా అలాగే ప్రవర్తించారు.

Telugu Canada, Gauri Shankar, Jarnailsingh, Khalistan, Ontario Temple, Shri Swam

ఇక గత నెలలో అంటారియో ప్రావిన్స్‌లో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ వాదులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్‌లో సమీపంలో ఈ సంఘటన జరిగింది.గాంధీ విగ్రహం 2012 నుంచి ఈ ప్రాంతంలోనే వుంది.

ఆరు అడుగుల ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది.గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో ప్రధాని నరేంద్ర మోడీపై విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.

అనంతరం విగ్రహం పక్కనే ఖలిస్తానీ జెండాను ఎగురవేశారు దుండగులు.అయితే విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు విగ్రహం వద్ద పిచ్చిరాతలు చెరిపివేసి, శుభ్రం చేశారు.

గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానిక భారతీయ కమ్యూనిటీ భగ్గుమంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube