Guinness Pakru : మరుగుజ్జు అయినా కూడా హీరో గా నటించిన ఇతడి గురించి మీకు తెలుసా ?

చూడచక్కని రూపం, ఎత్తు, రంగు, బరువు అన్ని సరిగ్గా ఉండే వారిని ఎవరైనా ఇష్టపడతారు.కానీ అవి లేనంత మాత్రాన ట్యాలెంట్ లేనట్టు మాత్రం కాదు కదా.

 Untold Facts About Hero Pakru-TeluguStop.com

ఒక సినిమా కు పనికి రావాలంటే అన్ని ఉండాలి.కానీ అన్నిటిని మించి నటించగలిగే ట్యాలెంట్ కూడా ఉండాలి.

అందుకే కొంత మందిని చూస్తే సినిమాకు కంటెంట్ ఉంటె చాలు కట్ అవుట్ తో పని లేదు అని అనిపిస్తుంది.అలాంటి వారిలో మొదటగా చెప్పుకోవాల్సిన నటుడు, మన అందరికి తెలిసిన మరుగుజ్జు పొట్టి వీరయ్య.

( Actor Potti Veeraiah ) కేవలం సినిమా అంటే పిచ్చితో తన ఆకారాన్ని కూడా పట్టించుకోకుండా ఎన్నో కష్టాలకు ఓర్చుకొని చనిపోయే వరకు ఏకంగా 500 ల సినిమాల్లో నటించాడు.

Telugu Potti Veeraiah, Ajay Kumar, Guinness Pakru, Krishna, Pakru, Potti Veerayy

బుల్లి తెరపై కూడా పొట్టి వీరయ్య సందడి చేసాడు.పొట్టి వీరయ్య క్రేజ్ గురించి చెప్పాలంటే తెలుగు వీర లేవరా సినిమా( Telugu Veera Levara movie) కృష్ణ గారు తీస్తున్న టైం లో ఏకంగా వీరయ్య డేట్స్ లేవు అని కృష్ణ గారు రెండు రోజుల పాటు షూటింగ్ ని కూడా ఆపారు.అయన కుమార్తె విజయ దుర్గ( Vijaya Durga ) కూడా మరుగుజ్జు మాత్రమే కాదు మంచి నటి.సినిమాల్లోనూ మరియు సీరియల్స్ లోను నటిస్తూ అందరిని అలరిస్తుంది.ఇక పొట్టి వీరయ్య తరహాలోనే మలయాళ నటుడు అజయ్ కుమార్ కూడా మంచి నటుడిగా ఎదిగారు.

Telugu Potti Veeraiah, Ajay Kumar, Guinness Pakru, Krishna, Pakru, Potti Veerayy

అజయ్ కుమార్ అంటే ఎవరు గుర్తు పట్టరు కానీ గిన్నిస్ పక్రు ( Guinness Pakru )అంటే మాత్రం గుర్తు పట్టేస్తారు.కేవలం సపోర్టింగ్ పాత్రలకు పరిమితం కాకుండా ఏకంగా హీరో గా కూడా చేసాడు.మన తెలుగు వాళ్లకు పెద్దగా తెలియకపోయిన అయన నటించిన అద్భుత ద్వీపం అనే సినిమా మాత్రం మంచి హిట్ అయ్యింది.అతి తక్కువ ఎత్తు ఉంది ప్రధాన పాత్రలో నటించినందుకు గాను పక్రు గిన్నిస్ రికార్డు అఫ్ బుక్ లోకి ఎక్కారు.

మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించి అందరిని అలరించారు.ఇలాంటి నటులను చూసినప్పుడే సినిమ ఇండస్ట్రీ లో రాణించాలంటే ట్యాలెంట్ ఉంటె చాలు అని.ఇక హీరో గానే కాదు 2013లో ‘కుట్టియుం కోలం’ అనే సినిమాను తానే రాసి దర్శకత్వం కూడా వహించి మరో మారు గిన్నిస్ కొట్టారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube