ఈ అలవాటు మానుకోకపోతే.. ఈ ఐదు సైడ్ ఎఫెక్ట్స్ పక్కా..

ఈ మధ్యకాలంలో చాలామంది సరైన సమయంలో తినడం మానేశారు.ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలన్న ఆలోచనతో టైం దాటిపోయిన కూడా తినకుండా అలాగే ఉండిపోతున్నారు.

 Most Dangerous Side Effects Of Eating Late At Night,eating Late At Night,telugu-TeluguStop.com

ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వేలాపాలాలు లేకుండా తింటే ఇది ఒక సరైన అలవాటు కాదు.రాత్రి భోజనం( Dinner ) పడుకోడానికి రెండు గంటల ముందే తినేసి పడుకోవాలి.

అయితే కొందరు మాత్రం ఇలా సమయం సందర్భం లేకుండా అర్థరాత్రి సగం నిద్రలో లేస్తారు.

తినకుండా పడుకోవడం వల్ల ఇలా అర్థరాత్రి ఆకలి వేస్తుంది.

అర్థరాత్రి అన్నం తినడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్( Side Effects ) వస్తాయి అని అంటున్నారు వైద్య నిపుణులు .రాత్రిపూట ఆలస్యంగా తినడం వలన ఆరోగ్యం పై తీవ్రమైన దీర్ఘకాలిక ప్రవాహాలు పడతాయి.అర్ధరాత్రి పూట ఆలస్యంగా తినడం, నూనెతో వేయించిన ఆహారాలను తినడం అలవాటు చేసుకుంటే ఇక అంతే సంగతులు.బరువు పెరగడం( Weight Gain ) జరుగుతుంది.

Telugu Problems, Tips, Syndrome, Telugu-Telugu Health

ఇది శరీరానికి మరింత హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇలా అర్ధరాత్రి అల్పాహారం తీసుకోవడం వల్ల నైట్ ఈటింగ్ సిండ్రోమ్( Night Eating Syndrome )అనే తినే రుగ్మతగా కూడా అభివృద్ధి చెందుతుంది.అందుకే ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట సరైన సమయంలో భోజనం తీసుకోవాలి.ఆలస్యంగా భోజనం చేస్తే నిద్రకు భంగం కలుగుతుంది.దీనివల్ల కొంతమందికి రాత్రిపూట విచిత్రమైన కలలు కూడా వస్తాయి.అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు( Gastric Problems ) కూడా కలుగుతాయి.

పేలవమైన జీర్ణ క్రియ, గుండె మంట, ఆసిడ్ రిఫ్లెక్స్ కు గురయ్యే అవకాశం కూడా ఉంది.

Telugu Problems, Tips, Syndrome, Telugu-Telugu Health

ఆలస్యంగా భోజనం చేస్తే కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం( Digestion )అవ్వదు.సరిగ్గా జీర్ణం కానీ ఆహారం వల్ల కడుపులో అధిక ఆమ్లాన్ని కలిగిస్తుంది.అందుకే నేరుగా పడుకోకుండా కాసేపు నడవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అంతేకాకుండా ఆలస్యంగా తింటే రక్త పీడనం, గుండె జబ్బులు( Heart Problems ), మధుమేహం లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.అంతేకాకుండా మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది.

నిద్రలేమి, మానసిక కల్లోలం, చిరాకు కూడా కలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube