త్వరలో స్మార్ట్ ఫోన్ల విషయమై కేంద్రం కొన్ని కీలక చర్యలు చేపట్టనుందని సమాచారం.విషయం ఏమంటే స్మార్ట్ ఫోన్లలో( Smart phones ) ముందగానే ఇన్ బిల్ట్ అవుతున్న ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌ల( Pre installed apps ) అంతు తేల్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
భద్రతా పరంగా అనేక సమస్యలు ఏర్పడడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.గూఢచర్యం, యూజర్ డేటా దుర్వినియోగం గురించి ఆందోళన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక కొత్తగా ప్రతిపాదిస్తున్న నిబంధనల ప్రకారం చూసుకుంటే ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించి, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను మాత్రమే తప్పనిసరి చేసేలా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలను ఆదేశించే పనిలో వుంది కేంద్రం.నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న భారత్ సెక్యూరిటీ విషయంలో అయితే ఎక్కడా రాజీ పడటం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇకపోతే ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగిస్తే స్మార్ట్ ఫోన్ కంపెనీలకు కోట్లలో నష్టాలు వాటిల్లే అవకాశం మెండుగా ఉంది.కాబట్టి ఈ నిర్ణయంపై ఆయా సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి!
ఇకపోతే గతంలో భారత్ టిక్‌టాక్‌తో సహా 300 కంటే ఎక్కువ చైనీస్ యాప్‌లను(Chinese apps) 2020లోనే కేంద్రం నిషేదించిన సంగతి విదితమే.ఇక అక్కడినుండి కేంద్రం పలు దఫాలు చైనీస్ యాప్స్ పైన కొరడా ఝుళిపిస్తూనే వుంది.చైనా కంపెనీలు అయిన హువాయ్ వంటి సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గూఢచర్యానికి పాల్పడే అవకాశం ఉందని అనేక దేశాలు ఆంక్షలు విధించగా అదేబాటలో భారత్ పయనిస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీదారులు తమ కొత్త మోడళ్లలో అన్ ఇన్ స్టాల్ చేసే విధంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.