ప్రధానమైన నూనె గింజల పంటలలో వేరుశెనగ ఒకటి.ఈ వేరుశనగ పంటకు తెగుళ్ళ, చీడపీడల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది.
క్రమం తప్పకుండా వేరుశెనగ పంటను గమనిస్తూ, సంరక్షణ పద్ధతులు పాటిస్తే పంటలో అధిక దిగుబడి పొందవచ్చు.వేరుశనగ పంట వేశాక మొదటగా వ్యాపించేవి వేరు పురుగులు.
వర్షాకాలంలో ఈ వేరు పురుగులు గుడ్లు పెట్టి భూమి అంతర్భాగంలో వృద్ధి చెందుతూ ఉంటాయి.కాబట్టి భూమి లోపలికి దుక్కి దున్నితే లోపల ఉండే పురుగులు బయట కనిపించడంతో పక్షులు వీటిని తింటాయి.
ఇంకా ఎండ ఎక్కువగా ఉంటే కూడా ఇవి చనిపోతాయి.
అయినా కూడా ఎక్కడో ఓ చోట వేరు పురుగులు పొలంలో తిష్ట వేసే ఉంటాయి.
వాటి నివారణకు 10% పోరెట్ గుళికలు ఎకరాకు 6 కిలోలు చొప్పున ఇసుకతో కలిపి చల్లితే వేరు పురుగులు నశిస్తాయి.ఇక పంట వేసిన 15 రోజుల నుండి ఆకు ముడత పురుగుల బెడద మొదలవుతుంది.
ఆకులపై గోధుమ రంగు మచ్చలు వచ్చి, ఆకుపచ్చ రంగులో చిన్న పురుగులు ఉంటాయి.ఈ పురుగుల వల్ల చెట్టు ఆకులు పండి, కాలినట్లు కనిపిస్తాయి.
దీనిని అగ్గి తెగులు అని కూడా అంటారు.
![Telugu Agriculture, Chlori Pyripas, Farmers, Groundnut, Groundnut Crop, Imidaclo Telugu Agriculture, Chlori Pyripas, Farmers, Groundnut, Groundnut Crop, Imidaclo]( https://telugustop.com/wp-content/uploads/2023/02/groundnut-Imidacloprid-groundnut-crop-farmers-Pests-agriculture.jpg)
క్లోరి పైరిపాస్ 500 మిల్లీలీటర్లు, 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి పిచ్చికారి చేసుకుంటే వీటి నుండి పంటను కాపాడుకోవచ్చు.ఇక పంట వేశాక, విత్తనం మొలకెత్తే తప్పుడు నల్లని శిలీంధ్రలు బీజాలతో కప్పబడి పంట ను నాశనం చేస్తాయి.లీటరు నీటిలో రెండు గ్రాముల కార్బండజిమ్ G మంకోజెట్ కలిపి నేలను తడపాలి.
ఇక తర్వాత దశలో కాండం కుళ్ళు తెగలు వచ్చి కాయలు కుళ్లిపోయే అవకాశం ఉంది.దీని నివారణకు లీటరు నీటిలో రెండు మిల్లీమీటర్ల హెక్స కొనజోల్ కలిపి పిచికారి చేయాలి.
కాండం కుళ్ళు వైరస్ తెగులు రాకుండా ఎకరం పొలానికి 80 మిల్లీలీటర్ల ఇమిడక్లోప్రిడ్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే పంట కు పురుగుల బెడద, చీడపెడల బెడద మరియు తెగుళ్ల నుండి పంటను కాపాడుకొని మంచి దిగుబడి పొందవచ్చు.