ఏ వ్యక్తికైనా వయసులో ఉన్నప్పుడు ఎవరిని చూసినా అందంగా కనిపిస్తారు.అందుకు రాంగోపాల్ వర్మ కూడా ఏం మినహాయింపు కాదు.
కాలేజీ రోజుల్లో చాలా మంది వెనకాల పడే వాడట.గ్యాంగ్ ను వేసుకుని కాలేజీలో కాలర్ ఎగరేసుకొని మరీ తిరిగేవాడట.
విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వారి కాలేజీలో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరిగిందట.అక్కడ కూలి పని చేయడానికి వచ్చిన ఒక అమ్మాయిపై రాంగోపాల్ వర్మతో పాటు అతడి క్లాస్మేట్స్ అందరి కళ్ళు పడ్డాయి.
ఆ అమ్మాయి పేరు రైఫిల్.పేరు ఎందుకు అలా పెట్టారో తెలియదు కానీ ఆమెకు ఆ పేరు చక్కగా సరిపోయింది అంటాడు వర్మ.
అతడి జీవితంలో అంతకన్నా మంచి సెక్సీ అమ్మాయిని వర్మ చూడలేదని చెప్తూ ఉంటాడు.
![Telugu Ram Gopal Varma, Love Story, Rifle, Siddhartha, Tollywood-Latest News Eng Telugu Ram Gopal Varma, Love Story, Rifle, Siddhartha, Tollywood-Latest News Eng](https://telugustop.com/wp-content/uploads/2023/02/Ram-gopal-varma-love-story-Siddhartha-College-tollywood-rifle.jpg )
ఓవైపు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతుండగా రైఫిల్ ని చూడడానికి వర్మతో పాటు వర్మ స్నేహితులంతా కూడా కిటికీలోంచి ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారట.ఆమె కాళ్ళ మీద ఎప్పుడు సిమెంట్ పేరుకుపోయి ఉండేదట.జుట్టును కూడా ముడిచేది కాదట.
కాళ్లకు చెప్పులు లేకుండా కళ్ళతోనే సూటిగా చూస్తూ ఉండేదట.చాలామంది స్త్రీలు తమ శరీరం మొత్తంతో కలిగించలేని ఉత్తేజాన్ని ఆమె తన ఒక చిటికెన వేలుతోనే కలిగించేది అంటూ ఎంతో బాగా పొగుడుతూ ఉంటాడు వర్మ.
కల్తీ లేని ఆమె మొహం చూస్తే రైఫిల్ తో కాల్చినట్టుగా ఉండేదట.దుస్తుల మాటున దాచిన ఆమె శరీరం గురించి ఎప్పుడూ ఊహించుకుంటూ ఉండేవాడట.
![Telugu Ram Gopal Varma, Love Story, Rifle, Siddhartha, Tollywood-Latest News Eng Telugu Ram Gopal Varma, Love Story, Rifle, Siddhartha, Tollywood-Latest News Eng](https://telugustop.com/wp-content/uploads/2023/02/Ram-gopal-varma-love-story-Siddhartha-College-rifle.jpg )
దేవుడు ఒక అమ్మాయిని ఎలా ఉండాలనుకొని సృష్టించాడుడో దానికి నిలువెత్తు రూపం రైఫిల్.తాను జీవితంలో దేవుడిని గౌరవం ఇచ్చానంటే దానికి ఒకే ఒక్క కారణం ఆడదాన్ని సృష్టించాడు కాబట్టి.అందుకే రైఫిల్ ని సృష్టించినందుకు దేవుడంటే అమితమైన గౌరవం ఏర్పడింది అంటాడు వర్మ.మా వయసు అలాంటిది కాబట్టి చీరను చుట్టిన టెలిఫోన్ స్తంభం కూడా కవ్వించేంత యవ్వనం కాబట్టి
రైఫిల్
ని చూస్తే ఏదో మత్తు కలిగేది.
ఆ మత్తులో ఆమె చుట్టూరా చెక్కర్లు కొట్టేవారు.సిద్ధార్థ కాలేజీలో ఎంత మంది అమ్మాయిలు ఉన్నా తాపీ పని చేస్తున్న రైఫిల్ పైనే అందరి కళ్ళు ఉండేవి.
మా మదిలో ఆమెకు శృంగార నాయకి అంటాడు.ఇప్పుడున్న అమ్మాయిలు ఎంతో మంచి బట్టలు వేసుకొని కనిపిస్తున్నప్పటికీ రైఫిల్ ని చూస్తే వచ్చిన భావన రావడం లేదు అంటున్నాడు వర్మ.