ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దు గుమ్మ కృతి శెట్టి.రెండు సంవత్సరాల పాటు బిజీ బిజీ గా సినిమా లు చేసింది.
మొదటి సినిమా ఉప్పెన విడుదల కుండానే మంచి గుర్తింపు ను సొంతం చేసుకుని రెండు మూడు సినిమా లు కమిట్ అయింది.ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యం లో వరుసగా సినిమా లు చేయడం మొదలు పెట్టింది.
రెండేళ్ల పాటు కృతి శెట్టి తిరుగు లేదు అన్నట్లుగా వరుస సినిమా లు చేసింది.
మొదటి మూడు సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలయ్యాయి.
దాంతో ఈ అమ్మడు కెరియర్ లో కష్టాలు మొదలయ్యాయి.బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనుకున్న సినిమా లు నిరాశ పర్చడం తో ఆఫర్లు తక్కువ అయ్యాయి.
ప్రస్తుతం తెలుగు లో ఈమె నటిస్తున్న సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
మలయాళం లో ఒక చిన్న సినిమా ను మాత్రమే చేస్తుంది.ఆ మధ్య తమిళం లో ఒక పెద్ద హీరో కి జోడి గా నటించే అవకాశాన్ని సొంతం చేస్తుందని ప్రచారం జరిగింది.ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిందని ప్రచారం జరుగుతుంది.
ఎట్టకేలకు ఈ ముద్దు గుమ్మ కు తెలుగు లో ఒక మెగా ఆఫర్ సొంతం అయ్యింది.ఈ సమ్మర్ నుండి చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
మెగా హీరో తో సినిమా అంటే కచ్చితంగా కృతి శెట్టి కెరియర్ మళ్ళీ గాడి లో పడ్డట్లే అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.కృతి శెట్టి ఈ సారి సక్సెస్ దక్కించుకుంటే మొన్న నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూగా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.ఒక వేళ మెగా హీరో మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడితే టాలీవుడ్ కి కృతి శెట్టి గుడ్ బై చెప్పాల్సి రావచ్చు.