కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ వారసుడు సినిమాతో యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నికర ఆస్తుల విలువ 445 కోట్ల రూపాయలు అని సమాచారం.ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని విజయ్ పారితోషికంగా అందుకుంటున్నారు.
తమిళనాడులో ప్రస్తుతం విజయ్ నంబర్ వన్ హీరోగా ఉన్నారు.
విజయ్ సినిమా సినిమాకు రెమ్యునరేషన్ ను అంతకంతకూ పెంచుతుండటంతో రాబోయే రోజుల్లో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
సౌత్ ఇండియాలోనే భారీగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్న హీరోలలో విజయ్ ఒకరిగా నిలిచారు.విజయ్ తెలుగు హీరోలతో కలిసి మల్టీస్టారర్స్ లో నటిస్తే బాగుంటుందని కొంతమంది సూచనలు చేస్తుండటం గమనార్హం.
తన గురించి వైరల్ అవుతున్న నెగిటివ్ వార్తలపై స్పందించడానికి కూడా విజయ్ ఇష్టపడటం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.విజయ్ వరుసగా ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తలను విజయ్ ఎక్కువగా పట్టించుకోవడం లేదు.
విజయ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.ఇతర స్టార్ హీరోలకు సైతం విజయ్ గట్టి పోటీ ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎంత ఎదిగినా విజయ్ ఒదిగి ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తెలుగు రీమేక్ సినిమాలలో నటించి విజయ్ తమిళనాడులో క్రేజ్ ను మరింత పెంచుకున్నారు.భిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయ్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ఎలాంటి పాత్రలో నటించినా తన మార్క్ ఉండేలా విజయ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.