వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను రేపు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ఈ రైలు నడవనుంది.
గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు సంక్రాంతి సందర్భంగా రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ క్రమంలో రేపు ఉదయం 9 గంటలకు రైలు ప్రారంభం అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు పంపామన్నారే.వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.
దేశంలో ఇది ఆరవ వందే భారత్ రైలని తెలిపారు.అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద దేశ వ్యాప్తంగా లక్షా 50 వేల బస్తీ దవాఖానాలు నిర్మించామని ఆయన వెల్లడించారు.అంతేకాకుండా ప్రతి నెలా లక్ష వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు.10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యమన్న కిషన్ రెడ్డి ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు.