పవిత్ర లోకేశ్ నరేష్ ను చంపేస్తుందేమో.. రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!

పవిత్ర లోకేశ్ నరేష్ రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు కానీ వాళ్ల పెళ్లికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకునే అవకాశం అయితే ఉందని సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

 Ramya Raghupati Shocking Comments Goes Viral In Social Media Details Here , Ram-TeluguStop.com

అయితే తాజాగా రమ్య రఘుపతి అటు నరేష్ గురించి ఇటు పవిత్ర గురించి సంచలన ఆరోపణలు చేశారు.

పవర్ టీవీ ఛానల్ నిర్వాహకులు నాకు ఎంతో సహాయం చేశారని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.

పవర్ టీవీ నిర్వాహకులు క్రాస్ చెక్ చేసి ఆ తర్వాత సపోర్ట్ చేశారని రమ్య రఘుపతి తెలిపారు.స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం ద్వారా నిజాలను వెలుగులోకి తెచ్చారని ఆమె కామెంట్లు చేశారు.

డబ్బు కోసం పవిత్ర నరేష్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందని రమ్య రఘుపతి తెలిపారు.

తలుపు తీసిన వెంటనే పవిత్ర బూతు మాట మాట్లాడటంతో నేను చెప్పు ఎత్తానని ఆమె కామెంట్లు చేశారు.

నరేష్ ను మందలించాలనుకుంటే ఇంట్లో మందలిస్తానని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.రూమ్ లోపల వాళ్లు ఏం మాట్లాడారో కెమెరా కంటికి కనిపించదని ఆమె కామెంట్లు చేశారు.

వాళ్ల ప్రవర్తన వల్లే వాళ్లు నెగిటివ్ అయ్యారని రమ్య రఘుపతి వెల్లడించడం గమనార్హం.ఆరోజు చాలాసేపు వాళ్లు తలుపు తియ్యలేదని రమ్య అన్నారు.

ఆ హోటల్ లో నేను చెక్ ఇన్ అయ్యానని ఆ తర్వాత 6 గంటలకు తలుపు తట్టగా 8 : 30 గంటలకు తలుపు తీశారని ఆమె కామెంట్లు చేశారు.పవిత్ర లోకేశ్ నరేష్ ను ఏమైనా చేస్తుందేమో అని భయపడ్డానని నరేష్ ను పవిత్ర చంపేస్తుందేమో అని అనిపించిందని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.రమ్య రఘుపతి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube