ఈ మధ్యకాలంలో మన దేశస్తులు చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలలో అత్యంత కీలకమైన పదవులను దక్కించుకుంటూ భారతదేశ గౌరవాన్ని ఇంకా పెంచుతూనే ఉన్నారు అమెరికా తాజాగా అగ్రరాజ్యమైన అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళకు కీలక బాధ్యతలు దక్కడం విశేషం చండీగఢ్‌లో జన్మించిన న్యాయవాది కుద్రత్ దత్తా చౌదరి శాన్ ఫ్రాన్సిస్కో నగరం, కౌంటీకి చెందిన వలస హక్కుల కమిషన్‌కు కమిషనర్‌గా ఎన్నికవ్వడం జరిగింది తాజాగా ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేశారు అంతేకాకుండా ఈ పదవి దక్కిన భారతీయ సంతతికి చెందిన మొదటి వలసదారుగా ఆమె చరిత్ర సృష్టించారు.ఫ్యాన్ శాన్ ఫ్రాన్సిస్కోలో నివసించే, పని చేసే వలసదారుల, సమస్యలు విధానాలపై అక్కడి మేయర్ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్లకు ఇమ్మిగ్రెంట్ రైట్స్ కమిషన్ మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఇక తనకు ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల కుద్రత్ దత్తా మాట్లాడుతూ నేను ఈ పాత్రను పోషిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను.శాన్ ఫ్రాన్సిస్కోలో నా కమ్యూనిటీ కోసం పని చేయడానికి నిజంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు.
స్వతహాగా న్యాయవాది అయిన ఆమె లింగ, మానవ హక్కులు, పిల్లల హక్కులు, సంఘర్షణ పరిష్కార నిపుణురాలు మరికొన్ని కొత్త అ బాధ్యతలను చేపట్టడం విశేషం.
![Telugu Advocatekudrat, Chandigarh, International, Punjabinstitute, San Francisco Telugu Advocatekudrat, Chandigarh, International, Punjabinstitute, San Francisco](https://telugustop.com/wp-content/uploads/2022/12/Another-key-responsibility-for-an-Indian-woman-lawyer-in-America.jpg )
ఈ కొత్త బాధ్యతలు చేపట్టడానికి ముందు కుద్రత్ దత్తా రాబర్ట్ బి.జాబ్‌కు చెందిన లా ఆఫీస్‌లో లా క్లర్క్‌గా పనిచేశారు.ఇక పంజాబ్ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా నుండి లా గ్రాడ్యుయేట్ అయిన ఈమె హార్వర్డ్ లా స్కూల్‌లో అంతర్జాతీయ చట్టంలోని స్త్రీవాదం, పితృస్వామ్య హింస గురించి అతిథి ఉపన్యాసాలు ఇచ్చారు.2014లో టఫ్ట్స్ యూనివర్శిటీలోని ది ఫ్లెచర్ స్కూల్ నుండి ఎల్ఎల్ఏం చేసిన కుద్రత్ దత్తా లండన్‌లోని కింగ్స్ కాలేజ్ సమ్మర్ స్కూల్‌లో క్రిమినాలజీ అండ్ క్రిమినల్ జస్టిస్‌లను అభ్యసించడానికి కంప్లీట్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్నారు.ఈ బుక్‌లో 2015 భూకంపం తర్వాత నేపాల్‌లో జరిగిన మానవ అక్రమ రవాణా, స్త్రీలపై లైంగిక దోపిడీ గురించి రాశారు.