ఏపీలో రానున్న ఎన్నికల్లో వైనాట్ 175కు పిలుపునిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా బస్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.గత ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనన్నారు.
కొందరు కావాలనే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.గతానికి ఇప్పటికి బడ్జెట్ లో తేడా లేదని పేర్కొన్నారు.
మరి గతంలో సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయని స్పష్టం చేశారు.