నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారు.నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
బాలయ్య చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షోకు క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ షో సక్సెస్ సాధించే విషయంలో తన వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే బాలయ్య చిన్న కూతురు, అల్లుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కాంబో కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మరో సినిమా 14 రీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.బాలయ్య చిన్నల్లుడు భరత్ ఈ సినిమాలో 20 శాతం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం.
మరోవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.ఆదిత్య 369 సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనుంది.
ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.నందమూరి కుటుంబంలో ఇప్పటికే 11 బ్యానర్లు ఉండగా రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.హీరో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్నాయి.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుందని ఖర్చు విషయంలో రాజీ పడకూడదనే ఆలోచనతోనే బాలయ్య సొంత బ్యానర్ లో సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా సొంత బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.