సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ మరో సారి విదేశాల పర్యటనకు వెళ్లారు.మహేష్ బాబు నమ్రత తో పాటు ఇద్దరు పిల్లలు కూడా విదేశాలకు వెళ్లిన విషయం తాజాగా ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేశారు.
అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం మహేష్ బాబు మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా నమ్రత సన్నిహితులు అంతా కలిసి విదేశాలకు వెళ్లారు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
గౌతమ్, సితార రెగ్యులర్ గా క్రిస్మస్ వేడుకలకు హాలిడే ట్రిప్స్ వెళ్లడం కామన్ గా జరుగుతూ ఉంటుంది.ఈ సారి మహేష్ బాబు నమ్రత కూడా వెళ్లారని సమాచారం అందుతుంది.
![Telugu Christmas, Gautham, Mahesh Babu, Maheshbabu, Namtrata, Pooja Hegde, Rajam Telugu Christmas, Gautham, Mahesh Babu, Maheshbabu, Namtrata, Pooja Hegde, Rajam]( https://telugustop.com/wp-content/uploads/2022/12/Trivikram-Pooja-Hegde.jpg)
ఇక మహేష్ బాబు తిరిగి వచ్చిన తర్వాత అంటే వచ్చే నెల లో త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.జనవరి లో ప్రారంభం కాబోతున్న రెండవ షెడ్యూల్ ఏకంగా రెండు నెలల పాటు ఏకధాటిగా నిర్వహించి దాదాపుగా సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా పూజ హెగ్డే నడుస్తోంది.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మళ్లీ చేస్తున్నట్లు త్రివిక్రమ్ తన సన్నిహితుల ద్వారా తెలియజేశాడు.
మహేష్ బాబు యొక్క తల్లి తండ్రి చనిపోవడం తో షూటింగ్ కార్యక్రమం ఆలస్యం అవుతూ వచ్చాయి.ఎట్టకేలకు మళ్ళీ షూటింగ్ ప్రారంభించాలనుకుంటే పూజా హెగ్డే ఖాళీ గా లేక పోవడం తో వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.