వైసీపీ హయాంలోనే ప్రాజెక్టులకు పునర్ వైభవం..: సీఎం జగన్

వైఎస్ఆర్ మరణించాక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయని సీఎం జగన్ తెలిపారు.కడప జిల్లాలో పర్యటించిన ఆయన కమలాపురంలో రూ.

950 పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అక్కడి వెనుకబాటును జయించేందుకు గాలేరి నగరిని తీసుకొచ్చేందుకు దివంగత నేత వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు.

వైఎస్ఆర్ మరణం తర్వాత దశాబ్ధాల పాటు ప్రాజెక్టులను ప్రభుత్వాలు పట్టించుకోలేదని సీఎం జగన్ తెలిపారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులకు పునర్ వైభవం వచ్చిందని పేర్కొన్నారు.17 టీఎంసీలతో బ్రహ్మసాగర్ ను నిండుకుండలా మార్చామని తెలిపారు.ఈ ప్రాజెక్టు కోసం రూ.550 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.గండికోట ప్రాజెక్టులో 25 టీఎంసీల నీటిని నిల్వ చేశామని స్పస్టం చేశారు.

అదేవిధంగా కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు