ఎమోషనల్ అయిన బాలకృష్ణ.. ఆ థియేటర్ దేవాలయం అని చెబుతూ?

స్టార్ హీరో బాలకృష్ణ డబ్బు కంటే విలువలకు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.బాలయ్య ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పటికీ అన్ స్టాపబుల్ షోను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేస్తూ ప్రశంసలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్ ఎపిసోడ్ మరింత స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

 Star Hero Balakrishna Emotional About Tarakarama Theatre Details, Balakrishna, N-TeluguStop.com

ఈరోజు బాలకృష్ణ ఏషియన్ తారకరామ థియేటర్ ను పునఃప్రారంభించారు.

థియేటర్ ప్రారంభం అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఈ మూవీ థియేటర్ కు చరిత్ర ఉందని అన్నారు.

ఏషియన్ తారకరామ థియేటర్ మాకు దేవాలయంతో సమానం అని బాలయ్య పేర్కొన్నారు.తల్లీదండ్రుల పేర్లు కలిసే విధంగా ఈ థియేటర్ ను ఏర్పాటు చేశామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఈ థియేటర్లో మొదట ప్రదర్శించబడిన సినిమా అక్బర్ సలీం అనార్కలి అని 1978 సంవత్సరంలో ఈ థియేటర్ ప్రారంభమైందని బాలయ్య పేర్కొన్నారు.

ఆ తర్వాత 1995 సంవత్సరంలో ఈ థియేటర్ ను పునఃప్రారంభించామని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఈ థియేటర్ ను తీర్చిదిద్దామని ఎమోషనల్ అవుతూ బాలయ్య కామెంట్లు చేశారు.పర్సనల్ గా ఈ థియేటర్ నాకు సెంటిమెంట్ అని బాలకృష్ణ అన్నారు.

నాన్న ఈ థియేటర్ లోనే మోక్షజ్ఞకు పేరు పెట్టారని ఆయన వెల్లడించారు.

ఏషియన్ సినిమాస్ తో మాకు సత్సంబంధాలు ఉన్నాయని బాలయ్య పేర్కొన్నారు.590 సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ థియేటర్ లో ఈ నెల 16వ తేదీ నుంచి అవతార్2 సినిమా ప్రదర్శితం కానుంది.రెక్లైనర్, సోఫాలు ఈ థియేటర్ లో అందుబాటులోకి వచ్చాయి.

ఏషియన్ తారకరామ హైదరాబాద్ లోని ఇతర మల్టీప్లెక్స్ లకు గట్టి పోటీ ఇవ్వనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వీరసింహారెడ్డి మూవీ ఈ థియేటర్ లో రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube