పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని తెలిసిందే.ఈయన ఏ పని చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ తెలుపుతారు.
అయితే మొదటిసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈయన సినిమా విషయంలో ఫైర్ అవుతున్నారు.అందుకు ఒక కారణం కూడా ఉంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రెండు సినిమాలను రిలీజ్ చేసాడు.
ఒకటి వకీల్ సాబ్.
రెండవది భీమ్లా నాయక్.ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి.కానీ ఫ్యాన్స్ కు సంతృప్తి అయితే లేదు.ఎందుకంటే ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే.అందుకే పవర్ స్టార్ రేంజ్ లో హిట్ అందుకోలేదు.ఇక ఈ రీమేక్ సినిమాలే నచ్చలేదు.
అంటే మరొక రీమేక్ రాబోతుంది అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
పవన్ అభిమానులకు ఈ వార్త బాగా డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ను ప్రెజెంట్ ఉన్న సమయంలో రెండు కొత్త సినిమాలు చేయబోతున్నాడు అని టాక్ వస్తుంది.ఇప్పటికే సుజీత్ తో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.
రెండవ సినిమాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా రాబోతుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ రోజు హరీష్ తమ కాంబోలో సినిమాపై అప్డేట్ ఇవ్వడం.
ఆ నెక్స్ట్ ఈ సినిమా తమిళ్ తేరి సినిమాకు రీమేక్ అని టాక్ రావడం కూడా జరిగిపోయాయి.
దీంతో రీమేక్ సినిమాలతో విసిగి పోయిన పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.ఇప్పటికే తేరి సినిమా తెలుగులో రిలీజ్ అవ్వడం ఇది చాలా మందికి తెలిసి ఉండడంతో ఈ రీమేక్ చెయ్యడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.దీంతో ట్విట్టర్ లో ”వి డోంట్ వాంట్ తేరి రీమేక్” అని స్టార్ట్ చేసి ట్రెండ్ చేసేసారు.
ఇలా ట్విట్టర్ లో యుద్ధం మొదలు పెట్టారు ఫ్యాన్స్.ఈ ట్యాగ్ తోనే పవన్ ఫ్యాన్స్ ఈ రీమేక్ విషయంలో సుముఖంగా లేరు అని తెలుస్తుంది.